Share News

House Door Jugaad Video: గదిని ఫ్రిడ్జ్‌గా మార్చేశాడుగా.. డోరుకు ఎలాంటి సెట్టింగ్ చేశాడో చూస్తే..

ABN , Publish Date - Aug 28 , 2025 | 07:10 AM

ఓ వ్యక్తి తన ఇంటి డోరును తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు లైట్లు మొత్తం ఆపేసి వెళ్తారు. కొందరు హడావుడిలో మర్చిపోయి వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమస్యకు ఈ వ్యక్తి వినూత్న పరిష్కారం చూపించాడు..

House Door Jugaad Video: గదిని ఫ్రిడ్జ్‌గా మార్చేశాడుగా.. డోరుకు ఎలాంటి సెట్టింగ్ చేశాడో చూస్తే..

కొందరు తమ ఇళ్లలో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇంట్లో ఏసీ లేకున్నా కూడా చిన్న చిన్న చిట్కాలతో ఏసీ ఎఫెక్ట్‌ను తీసుకురావడం, ఇటుకలతో కూలర్ నిర్మించడం, వాస్ బేసిన్‌కు పెట్రోల్ పంపు హ్యాండిల్ అమర్చం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి డోర్‌కు చేసిన వినూత్న సెట్టింగ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. గదిని ఫ్రిడ్జ్‌గా మర్చేశాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి డోరును తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు లైట్లు మొత్తం ఆపేసి వెళ్తారు. కొందరు హడావుడిలో మర్చిపోయి వెళ్తుంటారు. తీరా బయటికి వెళ్లాక.. ఆరెరే.. లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయానే.. అనుకుంటూ కంగారుపడుతుంటారు.


అయితే ఇలాంటి సమస్య లేకుండా ఓ వ్యక్తి తన ఇంట్లో వినూత్నమైన సెట్టింగ్స్ చేశాడు. డోరు వేయగానే (Installed Switch at the Door) ఇంట్లో లైట్స్ మొత్తం ఆఫ్ అయ్యేలా సెట్ చేశాడు. ఇందుకోసం గుమ్మం వద్ద ఓ స్విచ్ ఏర్పాట చేశాడు. డోరు వేయగానే ఆ స్విచ్ ఆఫ్ అయ్యేలా, డోరు తీయగానే ఆన్ అయ్యేలా సెట్ చేశాడు. దీంతో ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో డోరు వేయగానే.. ఇంట్లోని లైట్లు మొత్తం ఆఫ్ అయిపోతాయి. అలాగే మళ్లీ డోరు తీయగానే లైట్లు మొత్తం ఆన్ అవుతాయి.


ఇలా డోరుకు వినూత్నమైన సెట్టింట చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 07:10 AM