Share News

King Cobra Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ కింగ్ కోబ్రాను చూసి జనం పరుగులు..

ABN , Publish Date - Aug 27 , 2025 | 10:13 AM

భారీ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సుమారు 15 అడుగుల కింగ్ కోబ్రా ఒకటి ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

King Cobra Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ కింగ్ కోబ్రాను చూసి జనం పరుగులు..

పాముల్లో కింగ్ కోబ్రా ఎంత ప్రమాదరమో అందరికీ తెలిసిందే. దాని కాటు నుంచి బతికిబయడం దాదాపు కష్టమని చెప్పొచ్చు. కొన్ని పొడవైన కింగ్ కోబ్రాలు చూసేందుకు కూడా భయకరంగా ఉంటాయి. అలాంటి పాములు పొరపాటున సమీపానికి వస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. ఇలాంటి భారీ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సుమారు 15 అడుగుల కింగ్ కోబ్రా ఒకటి ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) చంపావత్ జిల్లాలోని ఖరక్కార్కి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోకి సుమారు 10 నుంచి 15 అడుగుల కింగ్ కోబ్రా ఎంటర్ అయింది. పామును చూగానే గ్రామస్తులంతా భయంతో పరుగులు తీశారు.


గ్రామస్తులు శబ్ధం చేయడంతో కింగ్ కోబ్రా సమీపంలోని (Huge King Cobra on hill) కొండపైకి పాకుతూ వెళ్లింది. అంత పొడవైన పాము అరుదుగా కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. కింగ్ కోబ్రాను పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి కీడూ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇంత పెద్ద కింగ్ కోబ్రాను చూడడం ఇదే మొదటిసారి’.. అంటూ కొందరు, ‘కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరం.. దీనికి దూరంగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌‌లు, 3.23 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 10:13 AM