Share News

Delivery Boy Funny Video: డెలివరీ పర్‌ఫెక్ట్‌గా చేశాడుగా.. ఈ పేపర్ బాయ్ టాలెంట్ చూస్తే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:20 PM

ఓ ఇంటి ఆవరణలో ఓ మహిళతో పాటూ మరో వ్యక్తి కూర్చుని ఉంటారు. కాసేపటికి ఆ ఇంటి ముందుకు ఓ ఆటో వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఎవరైనా దిగుతారేమో అని.. ఆ ఇంటి యజమాని చూస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Delivery Boy Funny Video: డెలివరీ పర్‌ఫెక్ట్‌గా చేశాడుగా.. ఈ పేపర్ బాయ్ టాలెంట్ చూస్తే..

పొద్దునే పేపర్ తీసుకొచ్చే డెలివరీ బాయ్.. ఎక్కడో పై అంతస్తులోకి లోకి కూడా పేపర్‌ను కింద నుంచే విసిరేయడం చూస్తుంటాం. ఇలా పేపర్ విసిరే పద్ధితి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు స్టైల్ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే మరికొందరు స్టైల్ చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో పేపర్ బాయ్ టాలెంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. హ్యాండ్ డెలివరీ అంటే ఇదేనేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలో ఓ మహిళతో పాటూ మరో వ్యక్తి కూర్చుని ఉంటారు. కాసేపటికి ఆ ఇంటి ముందుకు ఓ ఆటో వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఎవరైనా దిగుతారేమో అని.. ఆ ఇంటి యజమాని చూస్తున్నాడు.


ఇంతలో ఆ ఆటో డ్రైవర్ చేతిలోకి పేపర్ తీసుకుని, ఆటో దిగకుండానే పేపర్‌ను లోపలి నుంచి విసిరేశాడు. ఆ పేపర్ గాల్లో ఎగురుకుంటూ వచ్చి సరిగ్గా (Boy throws paper into homeowner's hand) ఆ ఇంటి యజమాని చేతుల్లో పడిపోయింది. పేపర్ ఎగురుకుంటూ రావడాన్ని చూసి అవాక్కైన అతను.. ఆ తర్వాత తాపీగా చదువుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదంతా కావాలని చేశారో.. లేదా అనుకోకుండా చేశారో తెలీదు గానీ.. మొత్తానికి ఈ పేపర్ బాయ్ టాలెంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. వాట్ ఎ డెలివరీ’.. అంటూ కొందరు, ‘హ్యాండ్ డెలివరీ అంటే ఇదేనేమో’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌‌లు, 4.67 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 01:07 PM