Vehicle Viral Video: దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:00 AM
ఓ గూడ్స్ లారీ దూసుకెళ్తోంది. ఇందులో అవాక్కవడానికి ఏమీ లేకున్నా.. ఆ వాహనం వెనుక రాసిన సందేశం చూసి అవాక్కవుతున్నారు. వాహనం వెనుక ఎవరూ రాయని విధంగా ఈ డ్రైవర్ హెచ్చరిక సందేశాన్ని రాశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
ఈ వాహానికి 50 అడుగుల దూరంలో ఉండండి, ప్లీజ్ సౌండ్ హార్న్, నన్ను వెంటపడకురా, అప్పు చేసి కొన్నా అలా చూడకు.. ఇలాంటి విచిత్రమైన కొటేషన్లు చూడగానే ఆటోలు, కార్లు, లారీలు గుర్తుకొస్తుంటాయి. కొందరు రాసే సందేశాలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి నవ్వు తెప్పించే సందేశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ లారీ వెనక రాసిన హెచ్చరిక సందేశాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘దీని సమీపానికి వెళ్లాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ గూడ్స్ లారీ (Goods lorry) దూసుకెళ్తోంది. ఇందులో అవాక్కవడానికి ఏమీ లేకున్నా.. ఆ వాహనం వెనుక రాసిన సందేశం చూసి అవాక్కవుతున్నారు. వాహనం వెనుక ఎవరూ రాయని విధంగా .. ‘జాగ్రత్త.. నేను GTA వైస్ సీటీ నుంచి డ్రైవింగ్ నేర్చుకున్నాను’.. అని రాసి ఉంది.
ఈ హెచ్చరిక చూసి అంతా కాసేపు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత అంతా Grand Theft Auto: Vice City అనే వీడియో గేమ్‌ను (Video game) గుర్తు చేసుకుని తెగ నవ్వుకుంటున్నారు. దీంతో ఆ వాహనం వెనుక వెళ్లడం కంటే చావడం మేలంటూ దూరం పాటిస్తున్నారు. ఓ వ్యక్తి ఈ విచిత్రమైన లారీని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ డ్రైవర్ శిక్షణ మామూలుగా లేదుగా’.., ‘ఈ లారీని ఫాలో చేయాలంటే ఆలోచించాల్సిందే’.., ‘ఇలాంటి శిక్షణ తీసుకోవడం అనితర సాధ్యం’.., ‘ఈ డ్రైవర్‌తో జాగ్రత్తగా ఉండడం బెటర్’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి