Share News

Sheep VS Bull: గొర్రే కదా అని దాడి చేసిన ఎద్దు.. చివరికి జరిగింది చూస్తే..

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:32 PM

గడ్డి మేస్తున్న గొర్రెల మంద దగ్గరికి ఓ ఎద్దు వెళ్లింది. వెళ్లింది సైలెంట్‌గా ఉండకుండా ఓ గొర్రెపైకి దాడి చేసేందుకు వెళ్లింది. గొర్రే కదా ఏం చేస్తుందిలే అని అనుకుందో ఏమో గానీ.. కొమ్ములతో ఎత్తి పడేయాలని చూసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Sheep VS Bull:  గొర్రే కదా అని దాడి చేసిన ఎద్దు.. చివరికి జరిగింది చూస్తే..

భారీగా కనిపించే జంతువులు కొన్నిసార్లు చిన్న చిన్న జంతువులు చేతిలో దారుణంగా ఓడిపోవడం చూస్తుంటాం. సింహం లాంటి క్రూర జంతువులు సైతం అప్పుడప్పుడూ ఘోరంగా పరాభవం పాలవుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గొర్రె ఎద్దును భయపెట్టింది. చివరకు దాన్ని ఎలా తరిమికొట్టిందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. కటౌట్ కాదు ఖలేజా ముఖ్యం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గడ్డి మేస్తున్న గొర్రెల మంద దగ్గరికి ఓ ఎద్దు వెళ్లింది. వెళ్లింది సైలెంట్‌గా ఉండకుండా ఓ గొర్రెపైకి దాడి చేసేందుకు వెళ్లింది. గొర్రే కదా ఏం చేస్తుందిలే అని అనుకుందో ఏమో గానీ.. (Bull tries to attack sheep) కొమ్ములతో ఎత్తి పడేయాలని చూసింది.


అయితే ఎద్దు దాడితో గొర్రెకు చిర్రెత్తుకొచ్చింది. ‘కామ్‌గా ఉంటే నన్నే కెలుకుతావా.. నువ్వు ఎద్దువైతే ఎవరికి భయం.. ఉండు నీ పని చెబుతా’.. అన్నట్లుగా దానిపైకి ఎదురు దాడి చేస్తుంది. పొడవడానికి వచ్చిన ఎద్దుతో ఢీ అటే ఢీ అంటుంది. ఇలా పలుమార్లు తలతో ఎద్దును ఢీకొంటుంది. చివరగా నాలుగైదు అడుగులు వెనక్కు వేసి.. పరుగు పరుగున వచ్చి ఎద్దును ఢీకొంటుంది. దెబ్బకు ఎద్దు జడుసుకుంటుంది. ‘ఈ గొర్రెతో అనవసరంగా పెట్టుకున్నానే.. ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్’.. అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది.


ఎద్దు పారితున్నా కూడా ఆ గొర్రె వదలకుండా చాలా దూరం (sheep chasing the bull) వరకూ వెంబడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ గొర్రె పవర్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘కటౌట్ కాదు.. ఖలేజా ముఖ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌‌లు, 36 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 12:32 PM