Funny Viral Video: అందుకే అన్నారు.. ఐకమత్యమే మహా బలమని.. కావాలంటే ఈ వీడియో చూడండి..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:47 AM
ఓ పెద్ద కార్ల షోరూంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కార్ల తయారీ, రిపేరు తదితర పనులన్నీ మిషిన్ల సాయంతో చేయడం చూస్తుంటాం. అయితే వైరల్ అవుతున్న వీడియోలో సిబ్బంది మొత్తం కలిసి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఐకమత్యమే మహాబలం.. అని పెద్దలు అంటుంటారు. అంతా ఐకమత్యంగా పని చేస్తే ఎంతటి కష్టాన్నైనా సులభంగా చేసేయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది యువకులు కలిసి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కార్ల షోరూంలో (Car showroom) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కార్ల తయారీ, రిపేరు తదితర పనులన్నీ మిషిన్ల సాయంతో చేయడం చూస్తుంటాం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోబోలను కూడా వాడడం చూస్తున్నాం.
అలాగే పెద్ద పెద్ద వస్తువులను బిల్డింగ్‌ల పైకి చేర్చేందుకు లిఫ్ట్‌లు, యంత్రాలను వాడడం చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. షోరూంలో ఓ కారు బాడీని అందులో పని చేసే యువకులంతా (Showroom staff carrying car to upper floor) కలిసి మోసుకుంటూ పై అంతస్తుపైకి తీసుకెళ్లారు. కింద ఫ్లోర్ నుంచి మెట్ల మార్గం గుండా వారంతా కారును ఎంతో సులభంగా మోసుకెళ్లడం కనిపించింది.
చీమలన్నీ కలిసి పామును లాక్కెళ్లిన చందంగా.. వీరంతా ఆ కారును పైకి మోసుకెళ్లడం చూసేవారికి విచిత్రంగా అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. వీరి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘జెన్యూన్ సర్వీస్ అంటే ఇదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి