Share News

Ganesha Idol: గణేశుడి విగ్రహంపై పిల్లి ఏం చేస్తుందో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 27 , 2025 | 09:01 AM

వినాయక చవితి సందర్భంగా ఓ గణేశుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా గణేశుడి విగ్రహం వద్ద ఎలుక ఉండడం సర్వసాధారణం. అయితే ఈ గణేశుడి విగ్రహం వద్ద పిల్లి కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Ganesha Idol: గణేశుడి విగ్రహంపై పిల్లి ఏం చేస్తుందో చూడండి.. వీడియో వైరల్..

వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్సవాలు మొదలయ్యాయి. పల్లె నుంచి పట్టణాల వరకూ వీధి వీధిలో గణేశుడి విగ్రహాలు కొలువుదీరాయి. వీటిలో వినూత్నమైన ఆకారాల్లో ఉండే విగ్రహాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గణేశుడి విగ్రహం వద్ద ఎలుక ఉండడం అందరికీ తెలిసిందే. అయితే ఈ వినాయకుడి విగ్రహం వద్ద ఎలుకకు బద్ధ శత్రువైన పిల్లి కనిపించింది. అది చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వినాయక చవితి (Ganesha Chavithi) సందర్భంగా ఓ గణేశుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా గణేశుడి విగ్రహం వద్ద ఎలుక ఉండడం సర్వసాధారణం. అయితే ఈ గణేశుడి విగ్రహం వద్ద పిల్లి కనిపించింది. అది కూడా ఆ పిల్లి నేరుగా వెళ్లి వినాకుడి ఒడిలో పడుకుంది.


వినాయకుడిలో ఒడిలో నిద్రపోతున్న ఈ పిల్లిని చూసి (Cat sleeping on Ganesha idol) అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చూసేందుకు.. నిద్రపోతున్న పిల్లిని వినాయకుడు లాలిస్తున్నట్లుగా ఉందీ దృశ్యం. దీంతో ఈ విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఎలుకకు శత్రువైన పిల్లి... ఇలా విచిత్రంగా వినాయుడిపైనే నిద్రపోవడం అందరికీ కొత్తగా అనిపించింది. అన్ని జీవులపై దేవుడి ప్రేమ ఒకేలా ఉంటుంది.. అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వినాయకుడిపై పిల్లి నిద్రపోవడం విచిత్రంగా ఉంది’.. అంటూ కొందరు, ‘అంతా వినాయకుడి మహిమ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లు, 9.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 09:22 AM