Car Funny Video: అది కారు అనుకున్నారా.. స్టవ్ అనుకున్నారా.. వీరి నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:37 PM
కారులో వెళ్తున్న కొందరు యువకులకు మార్గ మధ్యలో ఆకలి వేసింది. పచ్చి మాంసం కూడా సిద్ధంగా ఉంది. అయితే వండడానికి స్టవ్ మాత్రం లేదు. దీంతో వివిధ రకాలుగా ఆలోచించిన వారికి.. చివరకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. చివరకు ఏం చేశారో మీరే చూడండి..
వాహనాలను చిత్రవిచిత్రంగా ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. కొందరు బైకును నీరు తోడే యంత్రంగా వాడితే.. మరికొందరు బైకు టైరు సాయంతో ఏకంగా పంటపొలాల్లో గడ్డినే కోసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు కారు ఇంజిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అది కారు అనుకున్నారా.. లేక స్టవ్ అనుకున్నారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారులో వెళ్తున్న కొందరు యువకులకు మార్గ మధ్యలో ఆకలి వేసింది. పచ్చి మాంసం కూడా సిద్ధంగా ఉంది. అయితే వండడానికి స్టవ్ మాత్రం లేదు. దీంతో వివిధ రకాలుగా ఆలోచించిన వారికి.. చివరకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది.
ఐడియా రావడమే ఆలస్యం.. కారు ఇంజిన్ బానైట్ పైకెత్తి.. లోపల ఓ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇంజిన్‌పై మంట పుట్టించి, గ్రిల్‌పై మాంసం ముక్కలు వేసి ఫ్రై చేశారు. ఇలా ఇంజిన్ ముందు భాగాన్ని మొత్తం స్టవ్‌గా (Cooking on car engine) మార్చేసి, నాన్ వెజ్ కూరను సిద్ధం చేసేశారు. ఈ వింత ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అది కారు అనుకున్నారా.. స్టవ్ అనుకున్నారా’.. అంటూ కొందరు, ‘కారు ఇంజిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లు, 1.40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి