Share News

Crocodile VS Lions: చుట్టుముట్టిన సింహాలు.. గట్టిగా బదులిచ్చిన పిల్ల మొసలి.. చివరకు..

ABN , Publish Date - Aug 27 , 2025 | 11:44 AM

ఓ పిల్ల మొసలి ఒడ్డున ఉండగా.. నాలుగు సింహాలు దాన్ని చుట్టుముట్టేశాయి. ముందుగా వాటిలో ఓ సింహం మొసలి వద్దకు వెళ్లి పంజాతో కొట్టాలని చూస్తుంది. అయితే సింహం దగ్గరికి రాగానే మొసలి నోరు తెరిచి దానిపై దాడి చేసేందుకు వెళ్లింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

Crocodile VS Lions: చుట్టుముట్టిన సింహాలు.. గట్టిగా బదులిచ్చిన పిల్ల మొసలి.. చివరకు..

అడవిలో సింహాలు ఎంత శక్తివంతమైనవో.. నీటిలో మొసళ్లు కూడా అంతే బలవంతమైనవి. ఒక్కసారిగా వాటికి దొరికితే ఇక తప్పించుకోవడం కష్టం. దీంతో సింహాలు కూడా వాటి జోలికి వెళ్లేందుకు జంకుతుంటాయి. అయితే మొసళ్లు ఒడ్డున ఉన్న సమయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్ల మొసలిని నాలుగు సింహాలు చుట్టుముట్టేశాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల మొసలి ఒడ్డున ఉండగా.. నాలుగు సింహాలు దాన్ని చుట్టుముట్టేశాయి. ముందుగా వాటిలో ఓ సింహం మొసలి వద్దకు వెళ్లి పంజాతో కొట్టాలని చూస్తుంది. అయితే సింహం దగ్గరికి రాగానే మొసలి నోరు తెరిచి దానిపై దాడి చేసేందుకు వెళ్లింది. దీంతో భయపడ్డ సింహం.. వెనకడుగు వేస్తుంది.


అలా అక్కడున్న నాలుగు సింహాలు.. దాన్ని చంపాలని ప్రయత్నిస్తాయి. అయినా ఆ మొసలి చాలా సేపు (Crocodile fight with lions) వాటితో పోరాడుతూనే ఉంటుంది. అయితే ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ సింహం చివరకు మొసలి మెడ పట్టుకుంటుంది. మెడ పట్టుకుని గట్టిగా కొరికేసరికి మొసలి విలవిల్లాడిపోతుంది. ఇంతో చుట్టుముట్టి (Lions Killed the Crocodile) మొసలిని కొరికేస్తాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.


ఈ ఘటనలో మొసలి వాటికి ఆహారమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సింహాలకు చుక్కలు చూపించిన మొసలి’.. అంటూ కొందరు, ‘మొసలి చిన్నదైనా చాలా సేపు పోరాడింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15వేలకు పైగా లైక్‌లు, 4.96 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 11:45 AM