Monkey Steals Currency: కరెన్సీ కట్టలతో చెట్టెక్కిన కోతి.. కింద గుమికూడిన జనం.. చివరికి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:44 PM
ఓ కోతి కరెన్సీ నోట్ల కట్టలను ఎత్తుకుని సమీపంలోని చెట్టు ఎక్కేసింది. కాసేపటి తర్వాత ఆ నోట్లన్నింటినీ పైనుంచి కిందకు విసిరేసింది. చెట్టుపై నుంచి రూ.500 నోట్లు కిందపడడం చూసి చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమిగూడారు. చివరికి ఏం జరిగిందో చూడండి..
కోతుల నిర్వాకం కొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. చేతిలోని ఆహార పదార్థాలు, విలువైన వస్తువులను లాక్కెళ్లే కోతులు చివరకు వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో చుక్కలు చూపిస్తుంటాయి. కొన్ని కోతులు వాటికి కావాల్సిన ఆహారం తెప్పించుకుని, వారి వస్తువులకు తిరిగి ఇస్తుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి నోట్ల కట్టలతో చెట్టు పైకి ఎక్కింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఔరైయా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక దోడాపూర్ గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు తన న్యాయవాదితో కలిసి బిధున తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకునేందుకు బ్యాగులో రూ.80,000ల నగదు తీసుకొచ్చాడు. అయితే బ్యాగుతో ఆఫీసులో ఉండగా.. ఓ కోతి అక్కడికి వచ్చింది. అతడి బ్యాగులోని రూ.500 నోట్ల కట్టను లాక్కున్న కోతి.. (Monkey steals currency notes) వెళ్లి సమీపంలోని చెట్టు ఎక్కేసింది.
కాసేపటి తర్వాత ఆ నోట్లన్నింటినీ పైనుంచి (Monkey throws currency notes from tree) కిందకు విసిరేసింది. చెట్టుపై నుంచి రూ.500 నోట్లు కిందపడడం చూసి చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమిగూడారు. ఎవరికి దొరికిన నోట్లను వారు ఎత్తుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంతలో సదరు ఉపాధ్యాయుడు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు. విషయం తెలియజేసి తన డబ్బులను వేరుకునే పనిలో పడ్డాడు. చివరకు చూడగా..రూ.52,000 మాత్రమే దక్కింది. మిగిలిన రూ.28,000లను అప్పటికే అక్కడున్న వారు ఏరుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ డబ్బులను వెనక్కు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ ప్రాంతంలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. గతంలో ఇలా విలువైన వస్తువులు, పత్రాలను లాక్కెళ్లిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద తప్పించాలని కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘నగదు పంపిణీ చేసిన కోతి’.. అంటూ కొందరు, ‘కోతి వల్ల జనం పండుగ చేసుకున్నారుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 60 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి