Woman Paragliding Video: పారాగ్లైడింగ్‌లో మహిళ వింత నిర్వాకం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:13 AM
ఓ మహిళ పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ మెడలో డీజే సౌండ్ సిస్టమ్‌ను కూడా తీసుకెళ్లింది. పారాగ్లైడింగ్ ట్రైనర్.. ఆమెను తీసుకుని గాల్లోకి ఎగిరాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. గాల్లోకి వెళ్లిన తర్వాత ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది..
పారాగ్లైడింగ్ అంటే ఇష్టపడని వారుండరు. పక్షిలాగా ఆకాశంలో విహరిస్తూ.. అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ.. గాల్లో తేలిపోతూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. అయితే పారాగ్లైడింగ్ చేసే సమయంలో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు బైకుపై కూర్చుని ఆకాశంలో తేలిపోతే.. మరికొందరు పారాగ్లైడింగ్ చేస్తూ భోజనం చేయడం, డాన్స్ చేయడం వంటి వింత పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ మహిళ.. గాల్లో డీజే ప్లే చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆకాశంలో డీజే.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పారాగ్లైడింగ్ (Paragliding) చేయడానికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ మెడలో డీజే సౌండ్ సిస్టమ్‌ను కూడా తీసుకెళ్లింది. పారాగ్లైడింగ్ ట్రైనర్.. ఆమెను తీసుకుని గాల్లోకి ఎగిరాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. గాల్లోకి వెళ్లిన తర్వాత ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
అంతవరకూ ఈలలు, కేకలు వేస్తూ ఎంజాయ్ చేసిన మహిళ.. గాల్లోకి వెళ్లిన తర్వాత తన టాలెంట్‌ను బయటపెట్టింది. మెడలో తగిలించుకున్న డీజే సిస్టమ్‌ను ఆన్ చేసింది. ఆన్ చేయడమే కాకుండా రకరకాలుగా (Woman Played DJ in Air) డీజే వాయిస్తూ ఎంజాయ్ చేసింది. ఇలా గాల్లో విహరిస్తూనే.. మరోవైపు ఇలా చాలా సేపు డీజే వాయిస్తూ అంతా అవాక్కయ్యేలా చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదెక్కడి సరదారా నాయనా’.. అంటూ కొందరు, ‘ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.85 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి