Share News

Railway Station Viral Video: రైల్వే స్టేషన్‌‌లో జైలు సీన్.. ఏం చేశారో మీరే చూడండి..

ABN , Publish Date - Aug 28 , 2025 | 01:28 PM

సాధారణంగా ఏ గది డోరు లాక్ చేసినా కూడా.. దానికి తాళం వేయడం సర్వసాధారణం. అయితే ఈ రైల్వే స్టేషన్‌లో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Railway Station Viral Video: రైల్వే స్టేషన్‌‌లో జైలు సీన్.. ఏం చేశారో మీరే చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న వినూత్న సంఘటన చోటు చేసుకున్నా కూడా అది ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వింత వింత ప్రయోగాలు, విచిత్ర విన్యాసాలు, ప్రాంక్‌లు.. ఇలా సంఘటన ఏదైనా అందులో ఏమాత్రం కొత్తదనం ఉన్నా కూడా నెటిజన్ల దృష్టికి వెళ్లిపోతుంటాయి. వీటిలో కొన్ని ప్రయోగాలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలా ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లో (Bihar) బెట్టియా రైల్వే స్టేషన్‌లో అంతా అవాక్కయ్యే సీన్ కనిపించింది. సాధారణంగా ఏ గది డోరు లాక్ చేసినా కూడా.. దానికి తాళం వేయడం సర్వసాధారణం. అయితే ఈ రైల్వే స్టేషన్‌లో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది.


రైల్వే స్టేషన్‌లోని బెట్టియా నేమ్ బోర్డు పక్కనే ఉన్న ఓ గదిని లాక్ చేశారు. అయితే తలుపునకు తాళం వేయకుండా.. (room was locked with handcuffs) బేడీలతో లాక్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఖైదీలకు వేయాల్సిన బేడీలను తీసుకొచ్చి.. ఇలా రైల్వే స్టేషన్‌లో గది తలుపులకు వేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసిది. దీంతో అటుగా వెళ్లే వారంతా.. ఈ గదిని చూసి నవ్వుకుంటున్నారు.


కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘అయ్యో పాపం.. ఈ రైల్వే స్టేషన్‌‌ సిబ్బంది వద్ద తాళం కొనడానికి కూడా డబ్బులు లేవేమో’.. అంటూ కొందరు, ‘వీళ్లు బ్రిటిష్ అధికారుల్లా ఉన్నారే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 98 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 01:28 PM