Woman Jugaad Video: దోమతెరను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. పెద్ద సమస్యే తప్పిందిగా..
ABN , Publish Date - Aug 29 , 2025 | 09:39 AM
సాధారణంగా అంతా దోమతెరను ఎందుకు వాడతారు.. అని అడిగితే .. దోమలు రాకుండా అని టక్కున చెబుతాం. అయితే ఈ మహిళ మాత్రం దోమ తెరను విచిత్రంగా వాడి అందరినీ అవాక్కయ్యేలా చేసింది..
కొందరు వస్తువులను వాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వస్తువు తయారైంది ఒకదానికోసమైతే.. దాన్ని కొందరు వేరే వేరే పనులకు వాడుతుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా చేసే పనులు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. గ్యాస్ స్టైవ్‌ను షవర్‌లాగా, కుక్కర్‌ను ఐరన్ బాక్స్‌లాగా వాడడం చూస్తుంటాం. ఇలాంటి వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడయోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వలను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. బుర్రకు పని చెప్పింది.. కాపలా బాధ తప్పింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అంతా దోమతెరను (Mosquito net) ఎందుకు వాడతారు.. అని అడిగితే .. దోమలు రాకుండా అని టక్కున చెబుతాం. అయితే ఈ మహిళ మాత్రం దోమ తెరను విచిత్రంగా వాడి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ధాన్యాన్ని ఎండలో ఆరబోసే సమయంలో పక్షులు, జంతువులు తినకుండా అంతా కాపలాగా ఉండడం చూస్తుంటాం. అయితే ఈ మహిళ మాత్రం అలా చేయకుండా.. ధాన్యంపై (woman putting mosquito net on dried grain) దోమతెరను పెట్టేసింది. దోమ తెరను పెట్టడం వల్ల కాపలాగా ఉండాల్సిన బాధ తప్పింది. అలాగే ధాన్యం కూడా నష్టం కాకుండా పరిష్కారం కనుక్కుందన్నమాట.
ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘దోమతెరను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి