Share News

Food Viral Video: కూరలో నూనె ఎక్కువైందా.. చిన్న ట్రిక్‌తో ఈమెలా తీసిందో చూడండి..

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:20 PM

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆహార అలవాట్ల కారణంగా అనేక వ్యాధుల బారిన పడడం చూస్తున్నాం. బయటన జంక్ ఫుడ్ తిని కొందరు, ఇంట్లో వంటల్లో నూనె, మసాలాలు ఎక్కువ వాడుతూ మరికొందరు సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు.

Food Viral Video: కూరలో నూనె ఎక్కువైందా.. చిన్న ట్రిక్‌తో ఈమెలా తీసిందో చూడండి..

వంటింట్లో చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేసే మహిళలను చూస్తుంటాం. వంట చేయడంలో కొందరు అందిరిలా కాకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు చేసే ప్రయోగాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కూరలో ఉన్న అదనపు నూనెను ఓ మహిళ ఎలా బయటికి తీసిందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈమె ట్రిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆహార అలవాట్ల కారణంగా అనేక వ్యాధుల బారిన పడడం చూస్తున్నాం. బయటన జంక్ ఫుడ్ తిని కొందరు, ఇంట్లో వంటల్లో నూనె, మసాలాలు ఎక్కువ వాడుతూ మరికొందరు సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు.


ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ తాను వండిన కూరలో నూనె ఎక్కువ కావడంతో.. చివరకు చిన్న చిట్కాతో దాన్ని బయటికి తీసింది. ఇందుకోసం ఆమె.. కూర మధ్యలో చిన్న గుంట చేసి, అందులో చిన్న స్టీల్ గిన్నెను బోర్లించింది. దీంతో ఆ కూరలో ఉన్న నూనె మొత్తం గిన్నె కిందకు చేరింది. కూరపై మూత పెట్టి కొద్ది సేపటి తర్వాత చూడగా.. ఆ కూరలో ఉన్న నూనె మొత్తం మధ్యలోకి చేరింది. ఆ తర్వాత స్పూన్‌తో ఆ నూనెను బయటికి తేసేసింది.


ఇలా కూరలోని నూనెను సింపుల్‌గా బయటికి తీసేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈమె చిట్కా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఈ ఐడియా ఏదో బాగుందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 20.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 12:20 PM