Share News

Reels in Train Video: రైల్లో రీల్స్ చేస్తే ఇలాగే అవుతుంది.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:30 AM

ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కన కూర్చుని రీల్స్ చేస్తున్నాడు. రైలు వేగంగా వెళ్తున్నా కూడా డోరు వద్ద ప్రమాదకరంగా కూర్చుని వీడియోలు చేస్తున్నాడు. ఇంతలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Reels in Train Video: రైల్లో రీల్స్ చేస్తే ఇలాగే అవుతుంది.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

ప్రస్తుతం రైళ్లలో రీల్స్ చేయడం సర్వసాధారాణమైపోయింది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు డోరు వద్ద వేలాడుతూ వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కదులుతున్న రైల్లో డోరు వద్ద కూర్చుని రీల్స్ చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో డోరు (Man doing reels on Train) పక్కన కూర్చుని రీల్స్ చేస్తున్నాడు. రైలు వేగంగా వెళ్తున్నా కూడా డోరు వద్ద ప్రమాదకరంగా కూర్చుని వీడియోలు చేస్తున్నాడు. చేయి పూర్తిగా బయటికి పెట్టి ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు.


ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కింద నిలబడి ఉన్న ఓ వ్యక్తి కర్ర పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. రైలు దగ్గరికి రాగానే.. అతడి చేయిపై గట్టిగా కొట్టాడు. దెబ్బకు ఫోన్ ఎగిరి కిందపడింది. దీంతో ఆ వ్యక్తితో పాటూ పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదంతా కావాలని చేశారా.. లేదా దొంగలెవరైనా ఇలా చేశారా.. అన్నది తెలియలేదు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇాలాంటి వారికి ఇలాగే జరగాలి’.. అంటూ కొందరు, ‘రైళ్లలో ఇలా డోరు వద్ద కూర్చుని రీల్స్ చేయడం ప్రమాదరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 11:30 AM