Theft Funny Video: వైఫైతో ఫోన్ చోరీ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:16 PM
ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్రీ వైఫై అని ఓ చోట బోర్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్ చూసి దగ్గరికి వెళ్లాడు. తీరా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కొందరు చేసే దొంగతనాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఎదుటి వారిని మభ్యపెట్టి కొందరు, వీక్‌నెస్‌ను పసిగట్టి మరికొందరు తెలివిగా చోరీలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్రమైన దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫ్రీ వైఫ్ అని బోర్డు ఉండడం చూసి స్కాన్ చేయాలని వెళ్లాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫ్రీ వైఫై (Free WiFi) సౌకర్యం కల్పిస్తుంటారు. అయితే ఫ్రీ వైఫై కదా అని ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ చేసుకుని వాడితే అనేక నష్టాలు కూడా ఉంటాయి. సైబర్ నేరస్థులు ఫ్రీ వైఫై పేరుతో బ్యాంకు అకౌంట్లలో నగదును ఖాళీ చేయడం కూడా చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలను నిత్యం వింటూనే ఉంటాం.
అయితే తాజాగా, ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్రీ వైఫై అని ఓ చోట బోర్డుపై క్యూఆర్ కోడ్ (QR code) ఉంటుంది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్ చూసి దగ్గరికి వెళ్లాడు. ఫ్రీ వైఫై అని ఎంతో సంతోషంతో తన ఫోన్‌తో స్కాన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఇలా స్కాన్ చేయగానే.. ఆ పక్కనే నక్కి ఉన్న (Thief Stole Phone) దొంగ అతడి ఫోన్ లాక్కెళ్లిపోతాడు. దీంతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఆ వ్యక్తి సడన్‌గా షాక్ అయ్యాడు.
చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫ్రీ వైఫై పేరుతో చోరీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 4.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి