Funny Trending Video: స్కూటీపై ఫన్నీ సీన్.. మధ్యలో కూర్చుని ఈమె చేస్తున్న పని చూస్తే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:06 PM
ఓ వ్యక్తి తన స్కూటీపై ఇద్దరు మహిళను ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీపై వెళ్లడంలో విచిత్రమేమీ లేదు గానీ.. మధ్యలో కూర్చున్న మహిళ వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ప్రస్తుత యువత రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో వారికే తెలీనంతలా మారిపోతున్నారు. కొందరు ప్రేమికులు బైకులపై వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు బైకులపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. మరికొన్నిసార్లు ఒకే బైకుపై అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, స్కూటీపై మహిళ విచిత్రంగా ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్కూటీపై ఇద్దరు మహిళను ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీపై వెళ్లడంలో విచిత్రమేమీ లేదు గానీ.. మధ్యలో కూర్చున్న మహిళ వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
మధ్యలో కూర్చున్న మహిళ కామ్‌గా ఉండకుండా.. (Woman Removing Lices from Her Head) స్కూటీ నడుపుతున్న వ్యక్తి తలలో పేలు చూస్తోంది. ఈమె నిర్వాకం చూసి పక్క వాహనదారులు అవాక్కయ్యారు. ఇలా ఆమె చాలా దూరం వరకూ అలా అతడి తలతో పేలు చూస్తూనే ఉంది. ఈ ఘటనను వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అలాగే ఆయిల్ తీసుకుని మసాజ్ కూడా చేయకపోయావా’.. అంట కొందరు, ‘ఏంటమ్మా.. పేలు చూడటానికి నీకు ఎక్కడా స్థలం దొరకలేదా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి