Dogs: ప్రపంచంలో కుక్కలు ఎక్కువగా ఉండే దేశం ఇదే.. ఇండియా ఏ స్థానంలో ఉందంటే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:57 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..
వీధి కుక్కల వల్ల జనం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసు చివరకు సుప్రీం కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టొద్దని, ఆక్రోశం గల కుక్కలను వీధుల్లోకి వదలొద్దని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీధి కుక్కలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఏ దేశంలో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉంది.. భారత దేశం ఏ స్థానంలో ఉంది.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో (stray dogs case) సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కల సంఖ్య ఏ దేశాల్లో ఎక్కువ ఉంది.. మన దేశం ఏ స్థానంలో ఉందనే విషయానికొస్తే..
సాధారణంగా కుక్కలు మన దేశంలోనే ఎక్కువగా (Number of dogs) ఉంటాయని అంతా అనుకుంటాం. కానీ మీ అభిప్రాయం కరెక్ట్ కాదు. ప్రపంచంలోనే అత్యధిక కుక్కలు ఉన్న దేశం అమెరికా. ఇక్కడ 7.58 కోట్ల కుక్కలు ఉన్నాయని తెలిసింది. కుక్కల సంరక్షణ కోసం అమెరికాలో (America) కుక్కల పార్క్‌లు, గ్రూమింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ జంతు సంరక్షణ చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేస్తుంటారు. అలాగే రెండో స్థానంలో బ్రెజిల్ (Brazil) నిలిచింది. ఈ దేశంలో వీధి కుక్కలతో కలిపి మొత్తం 3.57 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఈ లాటిన్ అమెరికన్ దేశంలో సగం ఇళ్లలో పెంపుడు కుక్కలు కనిపిస్తుంటాయి.
అత్యధిక కుక్కలు ఉన్న దేశాల్లో చైనా (China) నాలుగో స్థానంలో ఉంది. చైనాలో 2.74 కోట్ల కుక్కలు ఉన్నాయట. ఇక భారత దేశం (India) విషయానికొస్తే.. ఇక్కడ సుమారు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రష్యాలో 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఈ దేశంలో ప్రభుత్వం, ప్రజలు కుక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారట. అలాగే ఫిలిప్పీన్‌లో 92 లక్షలు, ఫ్రాన్స్‌లో 74 లక్షలు, రొమేనియా దేశాలు 41 లక్షల కుక్కలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి