Couple Funny Video: ఇతడిది మామూలు తెలివి కాదుగా.. మందును క్షణాల్లో టీ చేశాడుగా..
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:35 PM
భార్య ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి ఎంచక్కా మందు తాగాలని ఫిక్స్ అయ్యాడు. అల్మారాలో దాచి పెట్టుకున్న మందు బాటిల్‌ను బయటికి తీశాడు. గ్లాసులో పోసుకుని తాపీగా తాగాలని చూసే క్రమంలో సడన్‌గా భార్య ఎంట్రీ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
దంపతుల మధ్య కొన్నిసార్లు గొడవలు జరిగితే.. కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. భర్తకు భయపడి భార్య.. భార్యకు భయపడి భర్త చేసే పనులు కొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తమ తప్పులను కవర్ చేసే క్రమంలో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. మందు తాగుతున్న భర్త.. సడన్‌గా భార్య రావడంతో భయపడి ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భార్య ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి ఎంచక్కా మందు తాగాలని ఫిక్స్ అయ్యాడు. అల్మారాలో దాచి పెట్టుకున్న మందు బాటిల్‌ను బయటికి తీశాడు. గ్లాసులో పోసుకుని తాపీగా తాగాలని చూసే క్రమంలో సడన్‌గా భార్య ఎంట్రీ ఇచ్చింది. తలుపు వద్ద నుంచి భర్తను పిలవడంతో.. ఒక్కసారిగా అతడికి గుండె ఆగినంత పనైంది.
రాదనుకున్న భార్య ఇలా సడన్‌గా రావడంతో అతడికి కాసేపు బుర్ర పని చేయలేదు. అయితే క్షణాల్లో అద్భుతమైన ఐడియా రావడంతో వెంటనే అమలు చేశాడు. మందుబాటిల్, వాటర్ బాటిల్‌ను దాచి పెట్టి.. గ్లాసులోని మందును (alcohol) స్టవ్‌పై ఉన్న గిన్నెలో పోశాడు. తర్వాత దాన్ని తీసుకుని గరిట పెట్టి, గ్లాసులోకి వడగట్టాడు. ఇలా మందు గ్లాసును (alcohol glass) కాస్తా.. టీ గ్లాసుగా (Tea glass) మార్చేశాడు. కొంచెం కొంచెం సిప్ చేస్తూ టీ తాగినట్లు కానిచ్చేశాడు.
భర్త చేస్తున్న పని చూసి ఎంతో మురిసిపోయింది. బుద్ధిగా టీ వేడి చేసుకుని తాగుతున్నాడని సంబరపడిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కవరింగ్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘మందు గ్లాసును కాస్తా.. టీ గ్లాసుగా మార్చేశాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి