Jugaad Vehicle Viral Video: కారును ఇల్లుగా మార్చాడుగా.. ఏం చేశాడో చూస్తే కళ్లు తేలేస్తారు..
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:40 PM
ఓ వ్యక్తి తన కారులో చేసిన వినూత్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా కార్లలోపల ఎంతో మంచి లుక్ కోసం చాలా మంది ఖర్చుకు వెనుకాడకుండా లగ్జరీ ఏర్పాట్లు చేయడం చూస్తుంటాం. అయితే ఇతను తన కారులో చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.
వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చడం, పాత వాహనాలను సరికొత్తగా డిజైన్ చేయడం తదితర ప్రయోగాల వీడియోలు నిత్యం చూస్తుంటాం. బైకును ఆటోలా, ఆటోను కారులా, కారును హెలీకాప్టర్ తరహాలో తయారు చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా కారుపై చేసిన ఓ ఫన్నీ ప్రయోగం వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులో చేసిన వినూత్న ఏర్పాటు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘కారును ఇల్లుగా మార్చేశాడుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారులో చేసిన వినూత్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా కార్లలోపల ఎంతో మంచి లుక్ కోసం చాలా మంది ఖర్చుకు వెనుకాడకుండా లగ్జరీ ఏర్పాట్లు చేయడం చూస్తుంటాం.
అయితే ఇతను అదంతా అనవరం అనుకున్నాడో ఏమో గానీ.. తన కారును ఏకంగా తన ఇంటి తరహాలో మార్చేశాడు. కారు లోపల కింద భాగంలో మ్యాట్‌లకు బదులుగా (Marble flooring in the car) రంగు రంగు మార్పుల్స్‌తో ఫ్లోరింగ్ చేయించాడు. ఇంట్లో ఎలాగైతే మార్బుల్ ఫ్లోరింగ్ చేస్తారో.. అచ్చం అలాగే కారులోపల కింది భాగంలో అలాగే చేయించాడు. ఈ కారులో కూర్చుంటే.. ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ సివిల్ ఇంజినీర్ కారులా ఉందే’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, ‘వాక్యూమ్ క్లీనర్‌కు బదులుగా చీపురు కావాలేమో’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లు, 3.18 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి