Woman Funny Video: ఈమెకు పెద్ద కష్టమే వచ్చిందిగా.. స్కూటీని బయటికి తీయబోయి..
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:29 PM
ఓ మహిళ తన స్కూటీని ఇంటి ఆవరణలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీ బయటికి తీయడంలో నవ్వుకోవడానికి ఏమీ లేదు గానీ.. బయటికి తీసిన విధానమే ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.
కొందరు తెలిసీ తెలీక చేసే పనులు కొన్నిసార్లు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలన్నీ కలిసి నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఇంటి నుంచి స్కూటీని బయటికి తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన స్కూటీని ఇంటి ఆవరణలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీ బయటికి తీయడంలో నవ్వుకోవడానికి ఏమీ లేదు గానీ.. బయటికి తీసిన విధానమే ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.
గేటును తీసిన తర్వాత స్కూటీని బయటికి తీసుకెళ్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఈమె స్కూటీపై కూర్చుని వెనక్కు తోసుకుంటూ గేటు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో గేటును బండితో అటూ, ఇటూ తోసి ఎలాగోలా తీస్తుంది. అయితే మధ్య మధ్యలో గేటు మూసుకుపోవడంతో తీసేందుకు తంటాలు పడుతుంది. ఆ తర్వాత బయటికి వెళ్లాలని చూడగా సాధ్యం కాదు. దీంతో మళ్లీ కాస్త ముందుకు వెళ్లి రివర్స్‌లో వస్తుంది. చివరకు ఎలాగోలా గేటు నుంచి బయటపడుతుంది కానీ.. వెనక్కు వెళ్లే క్రమంలో బండి వేగంగా (Woman falls while taking her scooter out of house) వెళ్లడంతో ధబేల్‌మని జారిపడిపోతుంది.
చివరగా మెల్లిగా పైకి లేచి వచ్చి గేటు మూసి వెళ్లిపోతుంది. ఇలా స్కూటీ బయటికి తీయడానికి ఆమె పడిన తంటాలు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె తన వంతు ప్రయత్నం బాగానే చేసింది’.. అంటూ కొందరు, ‘ఈమెకు స్కూటీ నడపడంపై పెద్దగా అవగాహన లేనట్లుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4700కి పైగా లైక్‌లు, 6.14 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి