Monkey Shocking Video: కళ్లతో చూస్తే గానీ నమ్మలేరు.. కొండపై ఈ కోతి చేసిన పని చూస్తే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:22 PM
జంతువులు తమ పిల్లలపై ఎంత ప్రేమ కనబరుస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కోతులైతే వాటి పిల్లలను ఎంతో మురిపెంగా పెంచుకుంటాయి. వాటికి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటుంటాయి. అయితే తాజాగా, ఓ కోతి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.
మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తారోమో గానీ.. జంతువులు మాత్ర తమ కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కొన్నిసార్లు జంతువుల ప్రేమ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. జంతువులను చూసి మనుషులు నేర్చుకోవాలనిపించేలా వాటి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇందుకు పూర్తి విరుద్ధమైన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోండపై కోతి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జంతువులు తమ పిల్లలపై ఎంత ప్రేమ కనబరుస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కోతులైతే వాటి పిల్లలను ఎంతో మురిపెంగా పెంచుకుంటాయి. వాటికి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటుంటాయి.
అయితే ఓ కోతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. తన పిల్లను ఎత్తుకుని కొండ పైకి ఎక్కిన కోతి.. చివరకు విచిత్రంగా ప్రవర్తించింది. కొండ పైనుంచి తన పిల్లను ఒక్కసారిగా (Monkey pushes its baby off cliff) కిందకు తోసేసింది. దీంతో ఆ పిల్ల కోతి చూస్తుండగానే పైనుంచి కిందకు జారిపడిపోయింది. తన పిల్ల కింపడిపోతున్నా కూడా ఆ తల్లి కోతిలో ఎలాంటి కంగారూ కనిపించదు. చూసేవారికి ఆ తల్లి కోతి కావాలనే తన పిల్లను కిందకు తోసి చంపినట్లుగా అనిపిస్తుంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతి ఏంటీ మరీ దారుణంగా ప్రవర్తించింది’.. అంటూ కొందరు, ‘ఇది కలా, నిజమా.. కోతులు ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదు’.. అంటూ మరికొందరు, ‘వీడియో తీస్తున్న వ్యక్తి.. వెళ్లి కాపాడొచ్చుగా’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2800కి పైగా లైక్‌లు, 8.37 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి