Snakes Viral Video: పైన చూడకుండా ఫ్యాన్ ఆన్ చేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:46 PM
ఇళ్లలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఊహించని ప్రదేశాల్లో ఏవేవో జీవులు కనిపించి షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ ఇంట్లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..
వింతలు, విశేషాలు, వినూత్న సంఘటనలకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. కొన్నిసార్లు కంటితో చూస్తే గానీ నమ్మలేని షాకింగ్ ఘటనలు మన చుట్టూ జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో తెగ సందడి చేస్తోంది. సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసిన ఓ వ్యక్తికి షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో ఇలాంటి సీన్ ఎక్కడా చూడలేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇళ్లలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఊహించని ప్రదేశాల్లో ఏవేవో జీవులు కనిపించి షాక్ ఇస్తుంటాయి. ఇక పాములైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూలు మొదలుకొని మంచాలు, ఫ్రిడ్జ్‌లు, గ్యాస్ స్టవ్‌లు ఇలా ఎవరూ అనుమానం రాని ప్రదేశాల్లో దర్శనమిచ్చి భయాందోళనకు గురి చేస్తుంటాయి.
ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పైకి చూడకుండా సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేశాడు. తీరా ఫ్యాన్ పైన చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. రెండు నాగుపాములు ఫ్యాన్ పైన పెనవేసుకుని పడగ విప్పి బుసలుకొడుతున్నాయి. కర్రతో పక్కకు తీయాలని చూడగా.. బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించాయి. తర్వాత ఆ రెండు పాములూ ఒకదాని మరొకటి కొరుకుతూ దాడి చేసుకుంటాయి.
మొత్తానికి ఫ్యాన్ పైన గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇదేంటీ, ఇలాంటి సీన్ ముందెన్నడూ చూడలేదే’.. అంటూ కొందరు, ‘ఫ్యాన్ ఆన్ చేసే ముందు పైకి చూడకుంటే అంతే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి