Couple Viral Video: గాలిలో భోజనాలు.. ఈ దంపతుల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:41 PM
కొత్తగా పెళ్లైన జంట హనీమూన్‌లో భాగంగా అందమైన ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వారు భోజనం చేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు..
భోజన ప్రియులను ఆకట్టుకోవడానికి కొందరు హోటల్ నిర్వాహకులు చిత్ర విచిత్ర ఏర్పాట్లు చేయడం చూస్తుంటాం. నగదు ఆఫర్ ప్రకటిస్తూ కొందరు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ మరికొందరు, వినూత్న పద్ధతుల్లో వంట చేస్తూ ఇంకొందరు కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. అలాగే జైలు, విమానంలో భోజనం పేరుతో వింత అనుభూతిని అందిస్తుంటారు. ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గాల్లో వేలాడుతున్న డైనింగ్ టేబుల్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంట (Newlywed couple) హనీమూన్‌లో భాగంగా అందమైన ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వారు భోజనం చేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. కుర్చీలతో సహా డైనింగ్ టేబుల్‌ను రోప్‌కు వేలాడదీశారు.
ఆ తర్వాత కొత్త జంటను దానిపై కూర్చోబెట్టి.. ముందుకు తోశారు. భార్య ఎదురుగా కూర్చొన్న భర్త.. రోప్‌ను పట్టుకుని టేబుల్‌ను జరుపుకుంటూ గాల్లో మధ్యలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎంచక్కా ప్రకృతిని (Couple eating while hanging in air) ఎంజాయ్ చేస్తూ భోజనం లాగించేశారు. ఇలా గాల్లో ప్రమాకర స్థితిలో భోజనం చేస్తున్న ఈ నవ దంపతులను చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చనిపోవడానికి ఇది చాలా సులభమైన మార్గం’.. అంటూ కొందరు, ‘ఇంత రిస్క్ తీసుకుని భోజనం చేయడం అవసరమా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి