Snake Funny Video: వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:09 PM
ఓ వ్యక్తి నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతన్ని దగ్గరగా చూసిన వారంతా భయంతో దూరంగా పారిపోతున్నారు. ఎందుకంటే అతడి మెడలో బతికున్న పాము వేలాడుతూ కనిపించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పాముల జోలికి వెళ్లాలని ఎవరికీ ఉండదు. అవి కనిపిస్తే ఎవరైనా ఆమడదూరం పారిపోతుంటారు. అయితే కొందరు మాత్రం పాములతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. వాటిని పట్టుకోవడమే కాకుండా నడుముకు చుట్టుకోవడం, చొక్కాలో వేసుకోవడం.. చివరకు నోట్లో పెట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పామును మెడలో వేసుకున్న వ్యక్తి.. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతన్ని దగ్గరగా చూసిన వారంతా భయంతో దూరంగా పారిపోతున్నారు. ఎందుకంటే అతడి మెడలో బతికున్న పాము వేలాడుతూ కనిపించింది.
ఎలాగైతే మెడలో కండువా వేసుకుంటారో.. అచ్చం అలాగే ఇతను (Man Wearing Snake Around His Neck) పామును మెడకు చుట్టుకున్నాడు. అయితే పాము కూడా అతడిపై దాడి చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అతను అటూ, ఇటూ తిరుగుతున్నా కూడా పాము అతడికి ఎలాంటి హానీ చేయదు. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఇతన్ని వింతగా చూస్తుండిపోయారు. కొందరు ఇతన్ని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’.. అంటూ కొందరు, ‘ఇక్కడ మనిషి కాదు పాము కంగారుపడుతోంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వార్త రాసే సమయానికి ఈ వీడియో 700కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి