Share News

Wild Dogs Hunted Deer: అడవి కుక్కల స్కెచ్ మామూలుగా లేదుగా.. నీళ్ల మధ్యలో ఉన్న జింకను..

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:19 PM

నీళ్లు తాగుతున్న జింకను దూరం నుంచి కొన్ని అడవి కుక్కలు టార్గెట్ చేస్తాయి. అవి దగ్గరికి రావడాన్ని చూసిన జింక.. తప్పించుకునేందుకు నీటి మధ్యలోకి వెళ్లిపోతుంది. అయితే చివరకు కుక్కలన్నీ కలిసి జంకను ఎలా వేటాడాయో మీరే చూడండి..

Wild Dogs Hunted Deer: అడవి కుక్కల స్కెచ్ మామూలుగా లేదుగా.. నీళ్ల మధ్యలో ఉన్న జింకను..

అడవి జంతువుల వేట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్నిసార్లు అవి వేటాడే విధానం చూస్తే మతి పోయేలా ఉంటుంది. కొన్నిసార్లు దూకుడుగా, మరికొన్నిసార్లు ఎంతో ప్లాన్‌గా వేటాడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటి మధ్యలో ఉన్న జింకను అడవి కుక్కలు వేటాడిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘అడవి కుక్కల సినిమా స్కెచ్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీళ్లు తాగుతున్న జింకను దూరం నుంచి కొన్ని అడవి కుక్కలు టార్గెట్ చేస్తాయి. అవి దగ్గరికి రావడాన్ని చూసిన జింక.. తప్పించుకునేందుకు నీటి మధ్యలోకి వెళ్లిపోతుంది. ఎలాగైనా జింకను వేటాడాలనే ఉద్దేశంతో అడవి కుక్కలన్నీ ఒడ్డున నిలబడి అటూ, ఇటూ తిరుగుతూ ప్లాన్ చేస్తాయి.


ఈ క్రమంలో కొన్ని కుక్కలు నీటిలో దిగి, ఈదుకుంటూ జింక వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తాయి. అయితే కాస్త దూరం వెళ్లగానే సాధ్యం కాక వెనక్కు వెళ్లిపోతాయి. ఎంత ప్రయత్నించినా వాటి వల్ల సాధ్యం కాదు. ఇంతలో దూరం నుంచి పరుగుపరుగున వచ్చిన ఓ కుక్క ఏమాత్రం ఆలోచించకుండా నీటిలోకి దిగేస్తుంది. నీటిలో వేటాడడం అలవాటు అయిన ఆ కుక్క.. ఈదుకుంటూ నేరుగా జింక వద్దకు వెళ్తుంది. కుక్క రావడాన్ని చూసిన జింక తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే కుక్క మాత్రం దాన్ని వదలకుండా చుట్టుముట్టేస్తుంది.


ఈ పెనుగులాటలో జింక చెవిని గట్టిగా పట్టుకున్న (Wild dog dragging deer out of water) కుక్క.. ఒడ్డుకు ఈడ్చుకెళ్తుంది. ఒడ్డుకు వెళ్లగానే అక్కడే ఉన్న మిగతా కుక్కలన్నీ ఒక్కసారిగా జింకను చుట్టుముట్టి, దూరంగా లాక్కెళ్తాయి. ఆ తర్వాత అన్నీ కలిసి దాన్ని చంపేసి ఆకలి తీర్చుకుంటాయి. ఆపై వాటి పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లి ఆహారం తినిపిస్తాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకుల సమక్షంలో జరుగుతుంది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ అడవి కుక్కల స్కెచ్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘జింకను చూస్తుంటే పాపం అనిపిస్తోంది.. కానీ ఇది ప్రకృతి ధర్మం కాబట్టి ఏమీ చేయలేం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 5.57 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 12:24 PM