Share News

Leopard VS Wild boar: దయ్యం కానీ పట్టలేదుగా.. చిరుతను చూడగానే అడవి పంది ఏం చేసిందంటే..

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:21 PM

అడవిలో ఓ చిరుత పులి పడుకుని వేట ఏదైనా కనిపిస్తే దాడి చేయాలని చూస్తుంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన అడవి పంది.. నేరుగా చిరుత ఎదురుగా వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Leopard VS Wild boar: దయ్యం కానీ పట్టలేదుగా.. చిరుతను చూడగానే అడవి పంది ఏం చేసిందంటే..

చిరుత పులి వేటకు వెళితే ఆహారంతో తిరిగి రావాల్సిందే. ఎంతటి జంతువైనా దాని కోరలకు చిక్కి చావాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే.. కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లి కూడా పులైనట్లు.. చిన్న చిన్న జంతువులు కూడా పులులు, సింహలపై విరుచుకుపడుతుంటాయి. వాటి ఆగ్రహానికి చివరికి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరుతను చూడగానే అడవి పంది చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ చిరుత పులి పడుకుని వేట ఏదైనా కనిపిస్తే దాడి చేయాలని చూస్తుంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన అడవి పంది.. నేరుగా చిరుత ఎదురుగా వెళ్లింది. అప్పటికే ఆ పంది కోపంగా ఉందో ఏమో గానీ.. చిరుతను చూసినా కూడా పారిపోకుండా.. అలాగే ముందుకు వెళ్లింది.


చిరుత దగ్గరికి వెళ్లి.. ‘ఎహే... నా స్థలంలో పడుకున్నావ్.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్తావా.. కోరలతో కుమ్మమంటావా’.. అన్నట్లుగా మీదకు దూకుతుంది. అడవి పంది ఆవేశాన్ని చూసిన చిరుత.. ‘వామ్మో.. ఈ పంది ఆవేశం చూస్తుంటే.. చంపేసేలా ఉందిగా.. ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్’.. అని అనుకున్నట్లుగా అక్కడి నుంచి పరుగందుకుంటుంది. అయినా అడవి పంది ఆ చిరుతను (wild boar chased away the leopard) వదలకుండా చాలా దూరం వరకు వెంబడిస్తుంది.


చిరుతను చూసి పారిపోవాల్సిన అడవి పంది.. అందుకు విరుద్ధంగా దాన్నే వెంబడించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పెద్ద సైజులో ఉండే పంది ముందు నుంచి ఇలా సడన్‌గా దాడి చేస్తే చిరుత ఇలా పారిపోవాల్సిందే’.. అంటూ కొందరు, ‘ఈ అడవి పంది దూకుడు మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 45 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

అడవి దున్నలా మజాకా.. కంటపడిన పులిని కాసేపటికే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2025 | 05:21 PM