Tiger Viral Video: అడవి దున్నలా మజాకా.. కంటపడిన పులిని కాసేపటికే..
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:27 PM
వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దారిలో ఓ పులి వేట కోసం వెతుకుతూ నిలబడి చూస్తోంది. పులిని చూడగానే పర్యాటకుల వాహనాలు అటూ, ఇటూ దూరంగా ఆగిపోయాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులన్నీ దూరంగా పారిపోతాయి. తర్వాత వాటిని వెంటపడి మరీ దాడి చేయడం, చంపేయడం.. ఇదంతా కామన్. అయితే పులులు కూడా భయపడే సందర్భాలు ఉంటాయా.. అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేటాడడం పక్కన పెట్టి ప్రాణాలను పంజాలో పెట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. దున్నపోతులను చూసిన పులి.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల్లో జంగిల్ సఫారీకి (Jungle Safari) వెళ్లిన పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దారిలో ఓ పులి వేట కోసం వెతుకుతూ నిలబడి చూస్తోంది. పులిని చూడగానే పర్యాటకుల వాహనాలు అటూ, ఇటూ దూరంగా ఆగిపోయాయి. రోడ్డు పక్కన నిలబడ్డ పులికి.. కాస్త దూరంలో అడవి దున్నలు (Gaur) కనిపించాయి.
పులిని చూడగానే పారిపోవాల్సిన దున్నలు అందుకు విరుద్ధంగా.. దానిపైపు సీరియస్‌గా చూశాయి. పులి కూడా కాసేపు దున్నల వైపు చూసింది. అయినా దున్నల్లో ఎలాంటి భయమూ కనిపించలేదు. తదేకంగా పులినే చూస్తున్న దున్న.. ‘మమ్మల్ని చంపడం నీ వల్ల కాదు కానీ.. పక్కకు వెళ్లి ఆడుకోమ్మా’... అన్నట్లుగా చూస్తుంది. అడవి దున్నలను చూసిన పులి.. ‘వీటిని చంపడానికి వెళ్తే తిరిగి వస్తానన్న నమ్మకం లేదు.. దీనికంటే ఇక్కడి నుంచి జంప్ అవడం మేలు’.. అని అనుకున్నట్లుగా అక్కడి నుంచి మెల్లిగా పక్కకు వెళ్లిపోతుంది.
దున్నలను చూడగానే వేటాడానికి వెళ్లాల్సిన పులి.. అందుకు విరుద్ధంగా (tiger moved aside upon seeing the gaur) సైలెంట్‌గా వెళ్లిపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పులినే వణికించిన దున్నలు’.. అంటూ కొందరు, ‘కంటి చూపుతో కాదు.. కొమ్ములతో చంపేస్తా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి