Woman Funny Reels: ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందీ.. ఎలాగైనా వైరల్ అవ్వాలని.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:25 PM
ఓ యువతి ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని పిక్స్ అయింది. ఏదోటి చేసి వ్యూస్, లైక్స్ తెచ్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ప్రస్తుత ప్రపంచం రీల్స్ చుట్టూ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటిదాకా చదువుకున్న వారి వరకే ఉన్న ఈ పిచ్చి.. ప్రస్తుతం మారుమూల పల్లెలకూ పాకింది. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం, వ్యూస్.. లైక్స్ చూసుకుని మురిసిపోవడం దినచర్యగా మారింది. ఈ క్రమంలో కొందరు ఎలాగైనా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అటకెక్కిన.. రీల్స్ పిచ్చి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని పిక్స్ అయింది. ఏదోటి చేసి వ్యూస్, లైక్స్ (Views, likes) తెచ్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇంకేముందీ, వంట గదిలోకి వెళ్లి ఫోన్‌ను నేలపై పెట్టి కెమెరా ఆన్ చేసింది.
వీడియో రికార్డింగ్‌పై క్లిక్ చేసిన ఆమె.. ఏదైనా నృత్య ప్రదర్శన ఇస్తుందేమో అనుకుంటే.. పరుగు పరుగున వెళ్లి.. అటక ఎక్కేసింది. అక్కడున్న వంట పాత్రలపై కూర్చుని దయ్యం పట్టిన మనిషిలా సైలెంట్‌గా ఉండిపోయింది. తనకేదే అయింది అని అంతా అనుకోవాలని తల అటూ , ఇటూ ఊపుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఇలా తనకు తోచిన విధంగా వీడియో చేసి (Reels video).. నెట్టింట్లోకి వదిలింది. ఇంకేముందీ.. ఆ వీడియోను నెటిజన్లు పిచ్చి పిచ్చిగా చూసేశారు.
అందులో ఎలాంటి కంటెంట్ లేకున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె.. ఏదో చేయాలనుకుని.. చివరకు ఇంకేదో చేసినట్లుంది’.. అంటూ కొందరు, ‘ఈమెకు మెమోస్ తినిపించలేదని అలిగినట్లుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 4.69 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి