Cooking Tricks Video: నానబెట్టిన శెనగల నీటిని పారబోస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూడండి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:59 PM
ఓ మహిళ వంటింట్లో వినూత్నమైన ప్రయోగం చేసింది. నానబెట్టిన శనగలను మొత్తం వడట్టింది. శనగలను పక్కన పెట్టిన తర్వాత.. ఆ నీటిని పారబోయడానికి వెళ్తుంది. అయితే వెంటనే తన నిర్ణయం మార్చుకుని.. చివరకు ఐస్ క్రీమ్ తయారు చేసింది..
వంటింటి చిట్కాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వంట చేసే సమయంలో చాలా మందికి అనేక సమస్యలు, సందేహాలు ఎదురవుతుంటాయి. కొందరు వాటికి సింపుల్ చిట్కాలు, ట్రిక్స్ చూపిస్తూ వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. తాజాగా, ఓ మహిళ వంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నానబెట్టిన శనగల నీటిని ఆమె వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంటింట్లో వినూత్నమైన ప్రయోగం చేసింది. నానబెట్టిన శనగలను (Soaked chickpeas) మొత్తం వడగట్టింది. శనగలను పక్కన పెట్టిన తర్వాత.. ఆ నీటిని పారబోయడానికి వెళ్తుంది. ఎవరైనా ఆ నీటిని పారబోయాలనే చూస్తారు. అయితే ఈమెకు విచిత్రమైన ఐడియా వచ్చింది. ఆ నీటిని వేస్ట్ చేయకుండా ఐస్ క్రీమ్‌గా మార్చాలని ఫిక్స్ అయింది.
ఇందుకోసం ముందుగా ఆ నీటిని బాగా చిలికింది. చాలా సేపు చిలికిన తర్వాత ఆ నీరంతా నురగలా తయారైంది. ఆ తర్వాత అందులో చక్కెర పౌడర్, చాకొలెట్ క్రీమ్‌ను (Powdered sugar, chocolate cream) వేసి బాగా మిక్స్ చేసింది. ఇలా చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టింది. కొన్ని గంటల తర్వాత బయటికి తీసి చూడగా ఐస్ క్రీమ్ తయారైంది. చివరగా దాన్ని గ్లాసుల్లో వేసి రుచికమైన ఐస్ క్రీమ్‌ను సిద్ధం చేసిందన్నమాట.
ఇలా శనగల నీటిని పారబోయకుండా ఐస్ క్రీమ్‌గా (Ice cream) మార్చిన ఈమె ప్రయోగం అందరికీ తెగ నచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ప్రయోగం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘శనగల నీటితో చక్కని ఐస్‌క్రీమ్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం