Share News

5kg Baby Born: మధ్యప్రదేశ్‌లో అరుదైన జననం.. బాల భీముడు పుట్టాడంటూ సంబరాలు..

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:10 PM

జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యలు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా..

5kg Baby Born: మధ్యప్రదేశ్‌లో అరుదైన జననం.. బాల భీముడు పుట్టాడంటూ సంబరాలు..

అరుదైన జననాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కొన్నిసార్లు శిశువులు రెండు తలలతో జన్మిస్తే.. మరికొన్నిసార్లు ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు జన్మిస్తుంటారు. అలాగే ఇంకొన్నిసార్లు వింత వింత సమస్యలతో జననాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వార్తలను నిత్యం వింటుంటాం. తాజాగా, ఇలాంటి అరుదైన జననం మధ్యప్రదేశ్‌లో సంభవించింది. 5 కేజీల బరువుతో పుట్టిన శిశువును చూసి అంతా బాల భీముడు పుట్టాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట 34 ఏళ్ల శుభంగి అనే గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా.. 5.2 కిలోలు (5kg Baby Born) ఉన్నట్లు తెలిసింది. ఇంత బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. వినాయక చవితి పండుగ సమయంలో బాబు పుట్టడంతో శిశువు తల్లితో పాటూ, కుటుంబ సభ్యులు సంబరపడిపోతున్నారు. గణేశుడి ఆశీర్వాదంతో పుట్టాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానికులంతా శిశువును చూసి పండుగ వేళ బాల భీముడు జన్మించాడంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


పోషకాహారం వల్లేనా..

సాధారణంగా శిశువులు 2.8 నుంచి 3.2 కిలోగ్రాముల మధ్య బరువు ఉంటారని, 5 కిలోల పైన శిశువు జన్మించడం చాలా అరుదుగా (Rare births) జరుగుతుంటుందని వైద్యులు తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి పోషకాహారం తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందన్నారు. ఇలాంటి సందర్భాల్లో సిజేరియన్ చేయడం కూడా సవాలుతో కూడుకుని ఉంటుందని.. అయితే వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ చేశారని చెప్పారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.


ఇలాంటి శిశు జననాలు గతంలో ..

ఇండోర్ ప్రభుత్వాస్పత్రిలో జూలైలో రీటా అనే 24 ఏళ్ల గర్భిణి 5.43 కిలోల శిశువుకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బరువైన నవజాత శిశువు ఇదేనని వివరించారు. ఇదిలాఉండగా, మాండ్లా జిల్లాలో 2021లో 5.1 కిలోల శిశువు జన్మించింది. మరోవైపు ఏపీలోని అనంతపురంలో 2023లో ఓ మహిళ 5.2 కిలో శిశువుకు జన్మనిచ్చింది. అదేవిధంగా 2021లో అస్సాంలోని కాచార్ జిల్లాలో ఓ మహిళ 5.2 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది.


ఇవి కూడా చదవండి..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 05 , 2025 | 04:10 PM