Share News

Watch Video: బహిరంగ ప్రదేశాల్లో ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Sep 05 , 2025 | 09:17 PM

ఓ పెట్రోల్ బంకు వద్ద ఓ పక్కగా ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడి వచ్చిన వారంతా చల్లని నీరు కదా అని వెళ్లి తాగుతుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ షాకింగ్ సీన్ కనిపించింది..

Watch Video: బహిరంగ ప్రదేశాల్లో ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

పైన పటారం.. లోన లోటారం.. అన్న చందంగా.. కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి శుభ్రంగా కనిపించే చాలా వస్తువులు.. లోపల అధ్వానంగా కనిపించడం చూస్తుంటాం. వాటర్ ట్యాంక్‌లు, హోటల్లో వంట పాత్రలు.. ఇలా అనేక వస్తువులను అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. అధికారుల తనిఖీల్లో ఇలాంటి సీన్లు అనేకం దర్శనమిస్తుంటాయి. ఈ తరహా వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఫ్రిడ్జ్‌లో నీళ్లు తాగుదామని వెళ్లిన వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెట్రోల్ బంకు వద్ద ఓ పక్కగా (Fridge at petrol station) ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడి వచ్చిన వారంతా చల్లని నీరు కదా అని వెళ్లి తాగుతుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ షాకింగ్ సీన్ కనిపించింది.


ఓ వ్యక్తికి ఫ్రిడ్జ్‌ను చూడగానే అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి.. ఫ్రిడ్జ్ పైన డోరు తెరుస్తాడు. డోరు తీయగానే లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. లోపల ఉన్న నీరు మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో పాటూ ఆ నీటిలో ఓ బల్లి కూడా (Sewage Waer and lizard in fridge) పాకుతూ కనిపించింది. అంత అధ్వానంగా ఉన్నా కూడా ఫ్రిడ్జ్‌ను శుభ్రం చేయకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అప్పుడే ఓ వ్యక్తి ఫ్రిడ్జ్ నీటిని పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు.


అయితే ఆ వ్యక్తి ఫ్రిడ్జ్ లోపల దృశ్యాన్ని చూపించడంతో అవాక్కై.. అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇకపై ఫ్రిడ్జ్ నీటిని తాగాలంటే ఆలోచించాల్సిందే’.. అంటూ కొందరు, ‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.46 లక్షలకు పైగా లైక్‌లు, 5.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2025 | 09:30 PM