Orangutan Viral Video: గిటార్ సౌండ్ వినగానే ఈ ఒరంగుటాన్లు ఏం చేశాయో చూస్తే.. ఆశ్చర్యపోతారు..
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:52 PM
ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన స్టేజ్‌పై కూర్చుని గిటార్ ప్లేచేస్తున్నాడు. దూరంగా ఉన్న ఒరంగుటాన్‌ల గుంపు.. గిటార్ సంగీతం వినగానే వెంటనే స్పందించింది. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..
సంగీతానికి స్పందించని జీవి అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. సంగీతంతో ఎన్నో వ్యాధులను కూడా నయం చేయవచ్చనే విషయం అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఒరంగుటాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంగీతం వినగానే దూరంగా ఒరంగుటాన్‌ల గుంపు చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన (MAN playing the guitar) స్టేజ్‌పై కూర్చుని గిటార్ ప్లేచేస్తున్నాడు. ఆ సంగీతం వినగానే దూరంగా ఉన్న ఒరంగుటాన్‌ల గుంపు వెంటనే స్పందించింది. అన్నీ కలిసి అక్కడ స్తంభాలపై కర్రలతో ఏర్పాటు చేసిన స్టేజిపైకి చేరుకుంటాయి.
పెద్ద ఒరంగుటాన్ తన పిల్లలతో అక్కడ బుద్ధిగా (Orangutans listening to guitar music) కూర్చుని సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుంది. అతడి సంగీతానికి పరవశించినపోయిన ఒరంగుటాన్ చప్పట్లు కొడుతూ ఆ వ్యక్తిని అభినందిస్తుంది. అతను గిటార్ వాయిస్తున్నంతసేపూ ఆ ఒరంగుటాన్ కుటుంబం... అక్కడే కదలకుండా కూర్చుని వింటూ ఉంటుంది. అలాగే కొద్ది సేపటి తర్వాత మరో కోతి కూడా అక్కడికి చేరుకుని గిటార్ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
సదరు వ్యక్తి ఇలా అనేక జంతువుల వద్ద గిటార్ వాయిస్తూ వాటి స్పందనను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది’.. అంటూ కొందరు, ‘వారికి కేటాయించిన సీట్లలో బుద్ధిగా కూర్చున్నారుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 4.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
అడవి దున్నలా మజాకా.. కంటపడిన పులిని కాసేపటికే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి