Woman Funny Video: ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:43 PM
రోడ్డుపై ఓ వివాహ ఊరేగింపు జరుగుతోంది. అందులో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. మహిళలు పాల్గొనడంలో విశేషమేమీ లేకున్నా.. వారిలో ముగ్గురు మహిళలు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి శుభకార్యం జరిగినా.. అందులో సినిమా తరహా షాకింగ్ ఘటనలు, తమాషా సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు ప్లాన్ చేసి మరీ వీడియోలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు అనుకోకుండానే తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నడి రోడ్డుపై పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. పట్టపగలు అంతా ఊరేగింపులో ఉండగా.. ముగ్గురు మహిళలు చేసిన నిర్వాకం చూసి అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా సందట్లో సడేమియా అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ వివాహ ఊరేగింపు (Wedding procession) జరుగుతోంది. అందులో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. మహిళలు పాల్గొనడంలో విశేషమేమీ లేకున్నా.. వారిలో ముగ్గురు మహిళలు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
అంతా పెళ్లి ఊరేగింపులో ఉండగా.. వారిలో ఓ మహిళ తన చీర కొంగు చాటున పెట్టుకున్న బీరు బాటిల్‌ను బయటికి తీస్తుంది. అంతా చూస్తుండగానే రోడ్డుపై గుటగుటా తాగేస్తుంది. ఆమె తాగడం చూసి అక్కడే ఉన్న మరో మహిళ దగ్గరికి వెళ్లి బాటిల్ తీసుకుని అందులో కొంత లాగించేస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న ఇంకో మహిళ (Women drinking beer in wedding procession) ఈ సీన్ చూసి వెంటనే వేగంగా ఆమె వద్దకు వెళ్తుంది. వెళ్లీ వెళ్లగానే బీరు బాటిల్ లాక్కుని మిగతా సగం గుటుక్కుమనిపిస్తుంది. ఈ సంఘటన మొత్తం రోడ్డుపై జనం మధ్యలోనే జరుగుతుంది.
ఈ ఘటనను అక్కడే దూరంగా ఉన్న వారు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సందట్లో సడేమియా అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘ఈ మహిళ నిర్వాకం మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
అడవి దున్నలా మజాకా.. కంటపడిన పులిని కాసేపటికే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి