Wife Kills Husband: పిల్లలు లేరని మూడో వివాహం.. కోరిక తీరింది గానీ చివరకు ప్రాణమే పోయింది..
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:59 PM
సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు. చివరకు అతడి కోరిక అయితే తీరింది కానీ.. పిల్లల బాగోగులు చూసుకోకుండానే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..
అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య వదిలేయడంతో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే రెండో భార్యకు పిల్లలు లేకపోవడంతో చివరకు ఆమె చెల్లెలిని మూడో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు వారికి సంతానం కలిగింది. పిల్లలు కావాలనే అతడి కోరిక అయితే తీరింది గానీ.. వారి బాగోగులు చూసుకుని మురిసిపోయే అవకాశం లేకుండా పోయింది. చివరికి మూడో భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామానికి చెందిన భయ్యాలాల్ రాజక్ (60) మొదటి భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో కొన్నేళ్లకు అతను గుడ్డి బాయి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే రెండో భార్యకు పిల్లలు కలగలేదు. ఎలాగైనా వారసులు ఉండాలనే ఉద్దేశంతో భయ్యాలాల్.. మూడో వివాహం (Third marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో చివరకు గుడ్డి బాయి చెల్లెలు మున్నీని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. భార్యతో పాటూ రెండు కుటుంబాల వారూ అంగీకరించడంతో భయ్యాలాల్‌తో మున్నీ వివాహం జరిగిపోయింది. వివాహమైన కొన్నేళ్లకు మున్నీకి ఇద్దరు పిల్లలు జన్మించారు. తన కోరిక నెరవేరడంతో భయ్యాలాల్ ఎంతో సంతోషించాడు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని గుర్తించలేకపోయాడు. ఈ క్రమంలో మున్నీకి నారాయణ్ దాస్ అలియాస్ లాలూ అనే వ్యాపారితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (Extramarital affair) దారి తీసింది. మున్ని తన భర్తకు తెలీకుండా లాలూను కలుస్తుండేది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలిసి భయ్యాలాల్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లాలూ.. ధీరజ్ కోల్ అనే వ్యక్తిని సంప్రదించాడు. చివరకు ముగ్గురూ కలిసి ఆగస్టు 30న రాత్రి భయ్యాలాల్ హత్యకు ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లో భయ్యాలాల్ పడుకుని ఉన్నాడు. వేకువజాము 2 గంటల ప్రాంతంలో లలూ, ధీరజ్ కలిసి భయ్యాలాల్‌ను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి, రాళ్లు కట్టి బావిలో పడేశారు.
మరుసటి రోజు ఉదయం భయ్యాలాల్ రెండో భార్య గుడ్డి బాయి ఏదో పని మీద అటుగా వెళ్లి బావిలో (Dead body in well) చూడగా ఏదో తేలుతున్నట్లు కనిపించింది. భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు అవడంతో చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 36 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కస్టడీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
ఇవి కూడా చదవండి..
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే
రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన
For More National News And Telugu News