Share News

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:36 PM

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు 2025 మేలో దోషిగా ప్రకటించింది.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే
Prajwal Revanna

బెంగళూరు: అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడి ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హసన్ నియోజకవర్గం మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు అక్కడ లైబ్రరీ క్లర్క్‌ (Library clerk) పనులు అప్పగించారు. జైలు నిబంధనల ప్రకారం యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలకు లేబర్ ప్రోగ్రాం అప్పగించడం తప్పనిసరి. లైబ్రరీ క్లర్‌గా ఖైదీలకు బుక్స్ ఇవ్వడం, రికార్టులు మెయింటెన్ చేయడం వంటి పనులు ప్రజ్వల్ చేయాల్సి ఉంటుంది.


నిర్వహణాపరమైన పనుల పట్ల తనకు ఆసక్తి ఉందని ప్రజ్వల్ చెప్పడంతో ఆయనకు లైబ్రరీ పనులు అప్పగించినట్టు జైలు అధికారులు తెలిపారు. పుసక్తాల పట్టిక తయారు చేయడం, వాటిని ఖైదీలకు ఇవ్వడం, బుక్స్‌ను ట్రాక్ చేయడం వంటివి ఆయన చేయాల్సి ఉంటుంది. రోజు వేతనంగా రూ.522 ఇస్తారు. రేవణ్ణ ఇప్పటికే ఒకరోజు డ్యూటీ పూర్తి చేసినట్టు జైలు అధికారి ఒకరు చెప్పారు.


మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనుమడు, జేడీఎస్ సీనియర్ నేత హెచ్ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై పలు అత్యాచార, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసులో ఆయనను ప్రత్యేక కోర్టు 2025 మేలో దోషిగా ప్రకటించింది. 2024లో ఆయనపై వచ్చిన పలు వీడియోలు సంచలనం కావడంతో 'సిట్' దర్యాప్తు జరిపింది. డిజిటల్, టెస్టిమోనియల్ సాక్ష్యాలను సేకరించింది. ప్రజ్వల్ అరెస్టు కావడానికి ముందు నెల రోజుల పాటు పరారీలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన

బీజేపీలో కామరాజ్‌ ప్లాన్‌

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 05:40 PM