Ideal Village: ఈ గ్రామస్తులపై 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:34 PM
ఈ గ్రామంలో 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఈ ఊరోళ్లకు పోలీస్ కేసులంటే ఏంటో తెలీదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఎఫ్ఐఆర్‌లు నమోదు కాకపోవడానికి కారణమేంటీ. . తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామం అన్నాక.. గొడవలు, కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు కామన్. కొన్ని పోలీస్ స్టేషన్లలో అయితే ఇలాంటి కేసులు పేరుకుపోతుంటాయి. అలాగే లెక్కకు మంచి ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుంటాయి. అయితే ఓ గ్రామంలో 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదంటే మీరు నమ్ముతారా. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజం. ఈ గ్రామంలో 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది.. ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడానికి కారణం ఏంటి.. తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) షాజహాన్‌పూర్ జిల్లాలోని నియమత్‌పూర్ గ్రామం ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ గ్రామస్తులపై 37 ఏళ్లుగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదు. ఈ గ్రామంలో మొత్తం 1,400 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు.

నియమత్‌పూర్ గ్రామానికి చెందిన అభయ్ యాదవ్ అనే వ్యక్తి 1988లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారట. అప్పటి నుండి గ్రామంలో ఎలాంటి వివాదం జరిగినా పోలీసుల (police) జోక్యం లేకుండానే పరిష్కరించబడుతుంది. ఎప్పుడైనా గొడవ జరిగి, పోలీసులు గ్రామంలోకి వచ్చినా.. గ్రామ పెద్దలు వారికి విషయాన్ని వివరించి, పరస్పర చర్చల ద్వారా పరిష్కరిస్తారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చిన్న వివాదాలు కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టులకు చేరుకుంటున్నాయి. అలాంటిది 37 ఏళ్లుగా ఈ గ్రామంలో ఎవరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం(No FIRs have been registered) అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ గ్రామం ప్రస్తుతం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం గురించి తెలుసుకున్న నెటిజన్లు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ గ్రామాన్ని అంతా ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి