Share News

Spider Viral Video: సాలీడు టాలెంట్ ముందు ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Sep 10 , 2025 | 09:03 AM

వేటాడే క్రమంలో పులులు, సింహాలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు చేసే వింత వింత విన్యాసాలు.. ఔరా అని అనిపిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సాలీడు వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది..

Spider Viral Video: సాలీడు టాలెంట్ ముందు ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. ఏం చేసిందో చూడండి..

ప్రపంచంలో మనిషిని ఆశ్చర్యానికి గురి చేసే ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కంటికి కనిపించే ప్రతి జీవిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. కొన్ని జీవులు చేసే పనులు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. వేటాడే క్రమంలో పులులు, సింహాలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు చేసే వింత వింత విన్యాసాలు ఔరా అని అనిపిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సాలీడు వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీని టాలెంట్ ముందు ఇంజినీర్లు కూడా దిగదుడుపే అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాలీడు (Spider) గూడు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటుంది. కుట్లు, అల్లికల తరహాలో ఎంతో అందంగా కనిపించడంతో పాటూ అలా ఎలా సాధ్యం అని అనిపించేలా వాటి నిర్మాణం ఉంటుంది. సాలీడు తన గూడును ఎలా నిర్మించుకుంటుందో చూడాలంటే దాదాపు సాధ్యం కాదు.


అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అది పెద్ద విషయమేమీ కాదు. ఓ వ్యక్తి గూడును నిర్మించుకునే సాలీడును తన కెమెరాలో బంధించాడు. గూడు మొదటి నుంచి చివరి దాకా మొత్తం వీడియో తీసి, దాన్ని ఫాస్ట్‌గా ప్లే చేయడం ద్వారా సాలీడు టాలెంట్ మొత్తం బయటపడింది. గూడును నిర్మించే క్రమంలో ముందుగా మధ్యలో నుంచి స్టార్ట్ చేసింది. దారాలు వదులుకుంటూ అటూ , ఇటూ తిరుగుతూ (spider built beautiful nest) చూస్తుండగానే అందమైన గూడును రెడీ చేసింది.


ఆ గూడులోకి అడుగు పెట్టే కీటకాలు తిరిగి వెళ్లే అవకాశం లేకుండా.. పద్మవ్యూహం తరహాలో ఆ గూడును తయారు చేసిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి’.. అంటూ కొందరు, ‘స్పైడర్ కాదు.. టాలెంట్ ఆర్టిస్ట్‌లా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.47 లక్షలకు పైగా లైక్‌లు, 3.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 09:13 AM