Share News

Drug factory seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:47 PM

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Drug factory seized in Hyderabad: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. సమాచారం మేరకు.. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు నగరంలోని చర్లపల్లిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 32 వేల లీటర్ల రా మెరీటియల్‌ను సీజ్ చేశారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ను అధికారులు గుట్టురట్టు చేశారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. బంగ్లాదేశీ మహిళను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.


drugs.jpg

‘వాగ్దేవి ల్యాబ్స్’ అనే పేరుతో ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉన్నా కూడా.. దాని మాటున డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేసిన డ్రగ్స్‌ను మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గత నెలలో మహారాష్ట్ర పోలీసులు ఒక విదేశీ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశారు. వారి నుండి 100 గ్రాముల డ్రగ్స్‌తో పాటూ రూ.25లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో నగరంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్, అతని సహచరుడు తానాజీ పాథే ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం

Updated Date - Sep 06 , 2025 | 05:05 PM