Share News

Beautiful Toilet Viral Video: అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:03 AM

ఎలాంటి ఖర్చు చేయకుండా టాయిలెట్‌లో అందమైన వ్యూపాయింట్ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది అసాధ్యం అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడ్డట్లే. ఎందుకంటే ఇలాంటి అందమైన టాయిలెట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Beautiful Toilet Viral Video:  అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

రోడ్డు సైడ్ సులభ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి లక్షల ఖర్చు నిర్మించే అత్యాధునిక టాయిలెట్ల వరకూ చాలా రకాల టాయిలెట్స్‌ను నిత్యం చూస్తుంటాం. సాధారణంగా టాయిలెట్స్‌లో ఒకరిని మించి మరొకరు వారు స్థాయికి తగ్గట్లు ఖర్చు చేసి ఖదీదైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే ఎలాంటి ఖర్చు చేయకుండా టాయిలెట్‌లో అందమైన వ్యూపాయింట్ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది అసాధ్యమని అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఇలాంటి అందమైన టాయిలెట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘పైన పటారం.. లోన అదిరిపోయే లొకేషన్..’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఇళ్లు నిర్మించుకునే సమయంలో బాల్కనీ నుంచి అందమైన వ్యూ పాయింట్ (Balcony Viewpoint) ఉండేలాని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అంద అందరికీ సాధ్యం కాదు. అయితే టాయిలెట్‌లో కూర్చున్నా కూడా అద్భుతమై లోకేషన్ చూసే అవకాశం ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే ఐడియా ఓ వ్యక్తికి వచ్చినట్లుంది.


ఆలోచన వచ్చిందే తడవుగా.. వెంటనే ఆచరణలోకి దిగాడు. టాయిలెట్‌ను సాధారంగానే నిర్మించినా.. డోరు తీసి లోపలికి వెళ్లగా అదిరిపోయే దృశ్యం కనిపించింది. దూరంగా ఎత్తైన పచ్చని కొండలు, వాటి మధ్యలో అందమై సెలయేర్లు.. ఇలా ఆ దృశ్యం ఆద్యంతం (Beautiful Viewpoint in Toilet) కనువిందు చేసేలా ఉంది. ఇలా టాయిలెట్‌లో కూర్చున్న వారికి ఎదురుగా అందమై ప్రకృతి దృశ్యాలు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ దృశ్యాలను ఒక్కసారి చూస్తే చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అంబానీ టాయిలెట్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవు’.. అంటూ కొందరు, ‘వావ్.. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.49 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 10:03 AM