Share News

Crocodile VS Jaguar: వేట కోసం పొంచి ఉన్న మొసలి.. వెనుకే వచ్చిన జాగ్వార్.. చివరకు..

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:44 PM

ఓ పెద్ద మొసలి ఆహారం కోసం నీటి ఒడ్డున వేచి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ జాగ్వార్ వేట కోసం వెతుకుతూ ఉంటుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..

Crocodile VS Jaguar: వేట కోసం పొంచి ఉన్న మొసలి.. వెనుకే వచ్చిన జాగ్వార్.. చివరకు..

మొసళ్లు ఎంత తెలివిగా వేటాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బురదలో కలిసిపోయి.. వేట దగ్గరికి రాగానే చటుక్కున లాగేసుకుంటాయి. ఒక్కసారి వాటి నోటికి చిక్కితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు మొసళ్లకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాల రూపంలో షాక్ తగులుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి వేట కోసం నీటి ఒడ్డున వేచి చూస్తూ ఉంది. ఇంతలో జాగ్వార్ దాని వెనుకే వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి ఆహారం కోసం నీటి ఒడ్డున వేచి చూస్తూ ఉంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ జాగ్వార్ వేట కోసం వెతుకుతూ ఉంది. మొసలిని చూసిన జాగ్వార్.. ఈ పూటకు ఎలాగైనా మొసలిని లాగించేయాలని ఫిక్స్ అయి.. నీటిలోకి దిగి, మెల్లిగా వెనుక వైపుగా వెళ్లింది.


దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా (Jaguar Attacking Crocodile) మొసలి పైకి దూకేస్తుంది. ఆ వెంటనే దాని గొంతు పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జాగ్వార్ నుంచి తప్పించుకోవాలని మొసలి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా మొసలి వల్ల సాధ్యం కాదు. ఇలా చాలా సేపు వాటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఈ ఘటనలో మొసలి జాగ్వార్ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అనిపిస్తోంది.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. జాగ్వార్ వేట మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘మొసలికి చుక్కలు చూపించిన జాగ్వార్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.91 లక్షలకు పైగా లైక్‌లు, 4.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 01:44 PM