Viral Video: వర్షంలో ఏదో చేసి వైరల్ అవ్వాలని అవ్వాలనుకుంది.. చివరికి చూడగా..
ABN , Publish Date - Sep 11 , 2025 | 08:04 AM
వర్షం పడుతున్న సమయంలో ఓ యువతి మేడపైకి వెళ్లి రీల్స్ చేసేందుకు ఫిక్స్ అయింది. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు వినూత్నంగా డాన్స్ చేయాలనుకుంది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్ , లైక్‌ల చుట్టే ప్రపంచం మొత్తం తిరుగుతోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం, వైరల్ అయితే మురిసిపోవడం దినచర్యగా మారిపోయింది. ఈ క్రమంలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు కొందరు కోతులకు తామేమీ తీసిపోము అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మేడపై వర్షంలో రీల్స్ చేయాలని చూసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వర్షం పడుతున్న సమయంలో ఓ యువతి మేడపైకి వెళ్లి రీల్స్ చేసేందుకు ఫిక్స్ అయింది. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో (young woman dancing in rain on rooftop) చివరకు వినూత్నంగా డాన్స్ చేయాలనుకుంది.
ఓ బెంచిపై నిలబడి ముందుకు, వెనక్కు ఊగుతూ డాన్స్ చేయబోయింది. ఇలా రెండు మూడు స్టెప్పులు వేయగానే ఒ్కసారిగా అదుపు తప్పి ధబేల్‌మని (young woman fell down while dancing) కిందపడిపోయింది. కిందపడిపోగానే కుయ్యో.. ముర్రో అనుకుంటూ పైకి లేచి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి ఈ యువతి వర్షంలో ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అయిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘ఏదో చేయాలని చూస్తే ఇంకేదో అయిందే’.. అంటూ కొందరు, ‘ఆమె ప్రతిభను ఇలా రహస్యంగా రికార్డ్ చేయడం చాలా పెద్ద తప్పు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 177కి పైగా లైక్‌లు, 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి