Share News

Optical illusion: ఈ తోడేళ్ల మధ్యలో దాక్కున్న స్పైడర్‌ను.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:07 AM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా తోడేళ్లు అడవిలో ఒకే చోట పడుకుని ఉన్నాయి. వాటి మధ్యలో ఆ తోడేళ్ల నాయకుడిని కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ సాలీడు కూడా దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి మరి..

Optical illusion: ఈ తోడేళ్ల మధ్యలో దాక్కున్న స్పైడర్‌ను.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే పైకి సాధారణంగా అనిపించినా.. లోపల అనేక పజిల్స్ దాగి ఉంటాయి. అయితే అందులోని పజిల్స్‌ను పరిష్కరించడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు వెతకడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ అనేక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా తోడేళ్లు ఉన్నాయి. అయితే ఇదే చిత్రంలో ఓ సాలీడు కూడా దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా తోడేళ్లు అడవిలో ఒకే చోట పడుకుని ఉన్నాయి. వాటి మధ్యలో ఆ తోడేళ్ల నాయకుడిని కూడా మనం చూడొచ్చు.


అక్కడున్న తోడేళ్లు అన్నీ ఎంతో సీరియస్‌గా చూస్తూ ఉన్నాయి. వాటి వెనుక పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో తోడేళ్లు, చెట్లు తప్ప ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీ కంటికి తెలీకుండా ఓ సాలీడు అక్కడ దాగి ఉంది. కానీ ఆ సాలీడును గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాని అంత కష్టం కూడా కాదు.


తీక్షణంగా గమనిస్తే ఎంతో సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఆ సాలీడును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే కనిపెట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సాలీడు ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ ఆ సాలీడును కనిపెట్టలేకుంటే మాత్రం ఈ క్రింది చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Sep 11 , 2025 | 11:07 AM