Paper Jugaad Video: పేపర్‌తో హ్యాండ్ వాష్ క్రీమ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:33 PM
ఓ వ్యక్తి పేపర్‌ను వినూత్నంగా మార్చి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ముందుగా అతను షాంపూ ప్యాకెట్‌ను తీసుకున్నాడు. దాన్ని కత్తిరించి షాంపూను మొత్తం పేపర్‌పై పోసేశాడు. తర్వాత ఏం చేశాడో మీరే చూడండి..
కొందరు కళ్ల ముందున్న వస్తువులతో అద్భుతాలు చేస్తుంటారు. మరికొందరు ఎవరూ చేయని విధంగా వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పేపర్‌ను హ్యాండ్ వాష్ క్రీమ్‌లా చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. పేపర్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పేపర్‌ను వినూత్నంగా మార్చి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ముందుగా అతను షాంపూ ప్యాకెట్‌ను తీసుకున్నాడు. దాన్ని కత్తిరించి షాంపూను (Man poured shampoo on paper) మొత్తం పేపర్‌పై పోసేశాడు. తర్వాత దాన్ని పేపర్ మొత్తం అయ్యేలా రుద్దాడు.
ఆ తర్వాత పేపర్‌ను పొరలు పొరలుగా మడత పెట్టాడు. ఆపై కత్తెర తీసుకుని పేపర్ చుట్టు పక్కల అంచులు మొత్తం కత్తిరించాడు. ఫైనల్‌గా ఆ పేపర్లను ఒక చిన్న అట్టకు పిన్ చేశాడు. ఇలా సిద్ధం చేసుకున్న పేపర్లను అవసరమైనప్పుడు చింపేసి, చేతులు శుభ్రం చేసుకునే క్రీమ్‌లా (Hand cleansing cream) వాడుతున్నాడు. ఇలా పేపర్‌తో ఇతను చేసిన వింత ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘హ్యాండ్ మేడ్ పేపర్ సోప్.. అదిరిందిగా’.. అంటూ కొందరు, ‘చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి