Share News

Desi Jugaad viral video: వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య.. ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:39 PM

ఓ మేకప్ కిట్ దుకాణంలో ఐ ఫోన్లు కనిపించాయి. దీంతో చాలా మంది మేకప్ దుకాణంలో ఐ ఫోన్లు ఉండడమేంటీ.. అని అనుకున్నారు. అయితే ఫోన్ వెనుక వైపు ఉన్న మూతను తీసి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Desi Jugaad viral video: వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య..  ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసే వెసులుబాటు వచ్చేసింది. కొందరు చేసే విచిత్ర ప్రయోగాలే ఇందుకు నిదర్శనం. సైకిల్‌ను బైకులాగా, బైకును ఆటోలాగా, ఇక ఆటోనేమో కారులాగా మార్చేయడం చూశాం. అలాగే ఇళ్లల్లోని వస్తువులను విచిత్రంగా వాడే వారిని కూడా చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దుకాణంలో ఐఫోన్లను చూసి అంతా అవాక్కవుతున్నారు. చూసేందుకు ఫోన్ లాగే కనిపిస్తున్నా.. దాని మూత తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మేకప్ కిట్ దుకాణంలో ఐ ఫోన్లు కనిపించాయి. దీంతో చాలా మంది మేకప్ దుకాణంలో ఐ ఫోన్లు (iPhones) ఉండడమేంటీ.. అని అనుకున్నారు. అయితే ఫోన్ వెనుక వైపు ఉన్న మూతను తీసి చూడగా.. లోపల మేకప్ కిట్ కనిపించింది.


అందులో అనేక మేకప్ కలర్స్‌తో (Makeup colors) పాటూ చిన్న బ్రష్‌లు కూడా ఉన్నాయి. ఇలా మేకప్ బాక్స్‌ను ఐ ఫోన్ తరహాలో డిజైన్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


‘ఐఫోన్.. మేకప్ కిట్.. అదిరిందిగా’.., ‘ ఐఫోన్ 17 కొనాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే బాగుంటుందేమో’.., ‘దీన్ని నా ప్రియురాలికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను’., ‘ఇది భారతదేశం.. ఇక్కడ ఏదైనా సాధ్యమే’.., ‘ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఇలాంటి ఐఫోన్‌లే వస్తాయేమో’.., ‘ఇది చైనా పీస్ అయి ఉంటుంది’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌‌లు, 89 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 12:39 PM