Kitchen Hacks Viral: స్టీల్ బాటిల్ అపరిశుభ్రంగా ఉందా.. ఈ సింపుల్ చిట్కా ట్రై చేస్తే తళతళలాడాల్సిందే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:21 PM
సాధారణంగా మురికిపట్టిన బాటిల్స్‌ను శుభ్రం చేయడంలో చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కొందరు ఏదో శుభ్రం చేశాం అంటే చేశాం అన్నట్లుగా కడిగేస్తుంటారు. అయితే ఈ కష్టం అంతా లేకుండా ఓ మహిళ చేసిన వింత ప్రయోగం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
వంటింటి చిట్కాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు వంట చేయడంలో వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. పాలు పొంగిపోకుండా ఏం చేయాలో చూపిస్తూ కొందరు, పూరీలకు నూనె అంటుకోకుండా ఎలా చేయాలో చెబుతూ ఇంకొందరు.. ఇలా అనేక రకాల చిట్కాలు చూపిస్తూ వీడియోలు చేస్తుంటారు. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ సందడి చేస్తోంది. స్టీల్ బాటిల్ వాసన రాకుండా, తళతళా మెరిచేలా ఓ మహిళ చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈ ఐడియా ఏదో బాగుందే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మురికిపట్టిన బాటిల్స్‌ను శుభ్రం చేయడంలో చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కొందరు ఏదో శుభ్రం చేశాం అంటే చేశాం అన్నట్లుగా కడిగేస్తుంటారు. అయితే ఈ కష్టం అంతా లేకుండా ఓ మహిళ చేసిన వింత ప్రయోగం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
బిర్యానీ ఆకును తీసుకున్న ఆమె.. దాన్ని ముందుగా స్టవ్‌పై కాల్చింది. ఆ తర్వాత మండుతున్న ఆకును స్టీల్ బాటిల్‌లో వేసి మూత పెట్టింది. కొద్ది సేపటి తర్వాత మూత తీయగా.. లోపల మొత్తం పొగ పట్టేసింది. ఆ తర్వాత బాటిల్‌లో (Woman cleans steel bottle with bay leaf) నీళ్లు పోసి శుభ్రం చేసేసింది. ఇలా సింపుల్‌గా బాటిల్‌ను శుభ్రం చేసిన ఈ మహిళ ట్రిక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ చిట్కా ఏదో బాగుందే’.. అంటూ కొందరు, ‘దీని బదులు నీటితో కడిగి ఎండలో ఆరబెడితే సరిపోతుంది కదా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.15 లక్షలకు పైగా లైక్‌లు, 21.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి