Zebra VS Lion: జీబ్రాను వెంటపడిన సింహం.. ప్రాణాలు తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:46 PM
ఆకలితో ఉన్న ఓ ఆడ సింహం వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇందలో దానికి దూరంగా ఓ జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. జీబ్రాను చూడగానే ఒక్కసారిగా దానిపైకి విరుచుకుపడుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
అడవికి రాజైన సింహం.. అందుకు తగ్గట్టుగానే వేటలోనూ తన రాజసం చూపిస్తుంటుంది. సింగిల్‌గా వెళ్లి మందలోని జంతువును మట్టికరిపిస్తుంటుంది. ఎంత పెద్ద జంతువైనా దాని బారిన పడిందంటే.. ఇక ప్రాణాలు వదలాల్సిందే. అయితే కొన్నిసార్లు మాత్రం షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రాణాలు తీయాల్సిన సింహం కాస్తా.. పారిపోయే పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జీబ్రాను వేటాడిన సింహం.. చివరకు దాని ప్రాణాలు తీయబోయింది. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి సీన్ రివర్స్ అయింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ ఆడ సింహం వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇందలో దానికి దూరంగా ఓ జీబ్రా కనిపిస్తుంది. ఇంకేముందీ.. జీబ్రాను చూడగానే ఒక్కసారిగా దానిపైకి విరుచుకుపడుతుంది. తన పవర్‌ఫుల్ పంజా కిందపడేసి, (Lion attacks zebra) మెడ పట్టేసుకుంటుంది. మెడ కొరికి దాన్ని చంపేసే ప్రయత్నం చేసింది.
అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సింహం నుంచి తప్పించుకోవాని జీబ్రా.. శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. దాని ప్రయత్నాలు వృథా కాలేదు. చివరకు సింహాన్ని నేలకు అదిమిపట్టేస్తుంది. దీంతో ఊపిరాడని సింహం.. జీబ్రాను వదిలేసి బతుకు జీవుడా.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత జీబ్రా కూడా (Zebra escapes from lion) అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా సింహం బారి నుంచి జీబ్రా ఆశ్చర్యకరంగా బయటపడుతుంది.
ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘జీబ్రా పవర్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఈ జీబ్రాకు భూమ్మీక నూకలు మిగిలున్నాయ్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి