Share News

Jugaad Viral Video: గరిటను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..

ABN , Publish Date - Sep 14 , 2025 | 09:39 AM

వంట చేస్తున్న ఓ మహిళ.. దాన్ని వీడియో తీసి, రీల్స్‌గా మార్చాలని అనుకుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆమె వద్ద ఫోన్ ఉంది కానీ.. వీడియో తేసేందుకు దానికి స్టాండ్ మాత్రం లేదు. అయినా సరే.. ఎలాగైనా స్టాండ్ ఏర్పాటు చేసి, వీడియో తీయాలని బలంగా నిర్ణయించుకుంది.

Jugaad Viral Video: గరిటను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏ పని చేసినా దాన్ని వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇక మహిళలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో చేసే అన్ని పనులనూ వీడియోలు తీసేస్తుంటారు. మరికొందరు వివిధ రకాల వంటలు చేస్తూ నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి మహిళలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా , వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. గరిటను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. గరిటను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వంట చేస్తున్న ఓ మహిళ.. దాన్ని వీడియో తీసి, రీల్స్‌గా మార్చాలని అనుకుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆమె వద్ద ఫోన్ ఉంది కానీ.. వీడియో తేసేందుకు దానికి స్టాండ్ మాత్రం లేదు. అయినా సరే.. ఎలాగైనా స్టాండ్ ఏర్పాటు చేసి, వీడియో తీయాలని బలంగా నిర్ణయించుకుంది.


ఈ క్రమంలో ఆమెకు ఎదురుగా ఉన్న గరిటను చూడగానే బల్బ్ వెలిగింది. గరిట పైన ఫోన్ పెట్టి, (Woman attaches phone to ladle) దానికి జడ రబ్బర్లను జాయింట్ చేసింది. ఆ తర్వాత గరిటను బియ్యం డబ్బాలో గుచ్చింది. ఇలా సెట్ చేసిన తర్వాత.. వంట చేయడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా ఆమె గరిటనే ఫోన్ స్టాండ్‌గా మార్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘గరటిను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.68 లక్షలకు పైగా లైక్‌లు, 11.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అంబానీ టాయిలెట్‌ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..

ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 09:39 AM