Puppy Imitates Turtle: ఈ కుక్కకు వెటకారం ఎక్కువనుకుంటా.. తాబేలు పక్కన ఏం చేస్తుందో చూస్తే..
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:45 PM
ఓ ఇంటి ఆవరణలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పెద్ద తాబేలు.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దాన్ని గమనించిన కుక్క పిల్ల.. తాబేలు వద్దకు వెళ్లింది. దాన్ని చూసి మొరుగుతూ కరవడానికి వెళ్తుందేమో అనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.
పక్కవారిని ఎవరైనా వెక్కిరిస్తుంటే.. వీడికి వెటకారం బాగా ఎక్కువనుకుంటా.. అని అంటుంటాం. అయితే ఈ వెక్కిరించడాలు, ఎగతాళి చేయడాలు వంటివి మనుషులకే సాధ్యం అని అనుకుంటున్నారా. అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే కొన్నిసార్లు అనేక జంతువులు ఇంతకంటే ఇంకాస్త ఎక్కువే చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాబేలును చూసి ఓ కుక్క పిల్ల చేసిన పని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వెక్కిరించడంలో మాస్టర్ డిగ్రీ చేసిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పెద్ద తాబేలు.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని గమనించిన కుక్క పిల్ల.. తాబేలు వద్దకు వెళ్లింది. దాన్ని చూసి మొరుగుతూ కరవడానికి వెళ్తుందేమో అనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. తాబేలు నడకను చూసి.. అచ్చం అలాగే నడవడానికి ప్రయత్నించింది.
వెనుక కాళ్లను పూర్తిగా చాపి.. ఈడ్చుకుంటూ తాబేలు తరహాలో మెల్లగా ముందుకు కదులుతుంది. ఇలా కొంత దూరం వరకూ తాబేలు మాదిరి నడుస్తూ.. (Puppy Imitated Turtle) దాన్ని వెక్కిరించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో తాబేలు కుక్క పిల్లను చూసి.. ‘దీనికి వెటకారం ఎక్కువైంది.. చెబుతా ఏదో రోజు నీ సంగతి’.. అని అనుకున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కుక్కపిల్ల మామూలుగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఈ ఘటనను మొత్తం ఆ ఇంటి యజమాని తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కుక్కకు వెటకారం బాగా ఎక్కువనుకుంటా’.. అంటూ కొందరు, ‘మనం ఎవరితో ఉంటామో.. వారికి కూడా అలాంటి అలవాట్లే వస్తాయి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి