Child Caught Snake Video: వీడిది మామూలు గుండె కాదుగా.. రెండు పాములను పట్టుకున్న పిల్లాడు.. చూస్తుండగానే..
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:51 PM
ఓ బాలుడు తన ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో రెండు పాములు అటుగా వస్తాయి. వాటిని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లాడు.. అందుకు విరుద్ధంగా ఆ పాముల సమీపానికి వెళ్లాడు. వెళ్లడమే కాకుండా నేరుతో వాటిని చేత్తో పట్టుకున్నాడు. చివరకు ఏమైందో చూడండి..
పాములను చూడగానే మనుషులే కాదు జంతువులు కూడా భయంతో దూరంగా ఆగిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొందరు పెద్దవారు పాములు పట్టుకుని అందరికీ షాక్ ఇస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ చిన్న పిల్లలు కూడా పాములతో ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటి ఆవరణలో కి వచ్చిన రెండు పాములను ఓ పిల్లాడు పట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు తన ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో రెండు పాములు అటుగా వస్తాయి. వాటిని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లాడు.. అందుకు విరుద్ధంగా ఆ పాముల సమీపానికి వెళ్లాడు. వెళ్లడమే కాకుండా నేరుతో వాటిని చేత్తో పట్టుకున్నాడు.
రెండు పాముల తోకలు పట్టుకున్న అతను.. (Child Caught Snake) వాటిని అటు, ఇటు తిప్పుతూ ఆడుకున్నాడు. అయినా ఆ పాములు మత్రం బుసలుకొట్టకుండా కామ్‌గా ఉండిపోయాయి. ఇలా ఆ పిల్లాడు చాలా సేపు ఆ పాములతో ఆడుకుంటుంటాడు. అయితే ఆ పాములు విషం లేనివి కావడం వలల్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘వామ్మో.. ఈ పిల్లాడి టాలెంట్ మాములుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి